Raghu Rama Filed case against EX Cm ys jagan and sunil kumar psr anjaneyulu: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు పలువురు అధికారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. గతంలో ఆయన వైసీపీ రెబెల్ఎంపీగా ఉన్న సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి, టార్చర్ చేశారంటూ కూడా గుంటురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా.. నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు. వైసీపీ హయాంలో తనపై రాజద్రోహం చట్టం కింద అరెస్టు చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పోలీసు స్టేషన్ లను తిప్పుడు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తు, దారుణంగా హింసించారన్నారు.
Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.
చివరకు తాను ఎంపీనన్న కూడా కనీసం కనికరంలేకుండా, టార్చర్ చేశారన్నారు. ఏపీ పోలీసులు తీరుపై అప్పట్లో హైకోర్టుకు సైతం వెళ్లినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో టార్చర్ చేసిన అధికారులపై ఎమ్మెల్యే రఘురామ గుంటూరులో ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు ప్రకారం.. సునీల్ కుమార్ (ఏ1),ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు (ఏ2), మాజీ సీఎం వైఎస్ జగన్ ను (ఏ3) గాను, అప్పట్లో ఉన్న సీఐడీ ఏఎస్పీగా పనిచేసిన విజయ్ పాల్ (ఏ4), గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి (ఏ5) గాను చేర్చారు.
వీరిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. హత్యాయత్నం, భయభ్రాంతులకు గురిచేయడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం వంటి కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానని.. ఐపీఎస్ సునీల్ కుమార్ తనను బెదిరించారని కూడా రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు గుంటూ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం టీడీపీని అణచి వేసే విధంగా పాలన సాగించిందని రఘురామ విమర్శించారు.
మాజీ సీఎం జగన్ ఏపీని అన్నిరకాలుగా నాశనం చేశారని అన్నారు. అన్ని వ్యవస్థలను పూర్తిగా దుర్వినియోగం చేశారన్నారు. అందుకే ప్రజలు వైసీపీకి బుద్ది చెప్పారని అన్నారు. జగన్ పాపం పండిందని ఆయన అక్రమాల చిట్టా అన్ని ఒక్కొక్కటిగా బైటకు వస్తాయని, తొందరలో జగన్ చిప్పకూడు తినడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు. ఇప్పటికే వైసీపీకి చెందని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలపై పోలీసుల కేసులతో ఉక్కిరిబిక్కిరౌతున్నారు. ఈనేపథ్యంలో ఏకంగా వైసీపీ నాయకుడు, మాజీ సీఎంపై కేసు నమోదు కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి