Journalists Protest At Secretariat: కొన్ని వారాలుగా తెలంగాణలో జర్నలిస్టులపై పోలీసులు దాడులు జరుగుతున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలని.. పోస్టులు పెంచాలని నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రసారం చేస్తున్న మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జీ తెలుగు న్యూస్ చానల్ రిపోర్టర్ శ్రీచరణ్‌పై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంతో జర్నలిస్టులు భగ్గుమన్నారు. పోలీసులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ఆవరణలోని మీడియా సెంటర్ వద్ద జర్నలిస్టులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. టీవీలు, పత్రికలు ఇతర మీడియా సంస్థల ప్రతినిధులు సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. కెమెరాలు కింద పెట్టేసి మౌనం పాటించారు. జర్నలిస్టులపై జరుగుతున్న పోలీసుల దాడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
Also Read: CI Rajender Rude Behaviour: జీ మీడియాపై సీఐ రాజేందర్ అదే దురుసుతనం.. మీకేం పనీపాటా లేదా అంటూ అక్కసు
ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు కోరారు. ఓయూలో దాడికి పాల్పడిన సీఐ రాజేందర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ ముట్టడి, విద్యా శాఖ కార్యాలయం ముట్టడి సమయంలో, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో జర్నలిస్టులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్‌లో మీడియాపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కాగా జీ మీడియాపై దాడి ఘటనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Journalists Protest: జీ మీడియా దాడిపై జర్నలిస్టుల భగ్గు.. సచివాలయం ఎదుట ధర్నా