Pink Lips Naturally: ఇలా చేస్తే మీ పెదాలు వారంలో నేచురల్‌గా పింక్‌ రంగులోకి మారిపోతాయి..

Pink Lips Naturally: పెదాలు జీవం లేకుండా నిర్జీవంగా ఉంటే అందంగా కనిపించవు. కొంతమంది పెదాల చుట్టూ నల్లగా మారిపోతాయి. దీనికి కొన్ని హోం రెమిడీలు ఉన్నాయి. దీంతో మీ పెదాలు నేచురల్‌గా పింక్‌ కలర్‌లోకి మారిపోతాయి.
 

1 /7

ఎక్స్‌ఫోలియేట్‌.. పెదాలప డెస్‌ సెల్స్‌ తొలగించుకోవానికి పెదాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. దీనికి చక్కెర, తేనె ఉపయోగించి స్క్రబ్‌ చేసుకోవాలి. పెదాలపై సర్క్యూలర్‌ మోషన్లో స్క్రబ్‌ చేయాి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పెదాలను శుభ్రం చేసుకోవాలి. తేనె మాయిశ్చర్‌ అందించి మృదువుగా మారుస్తుంది.

2 /7

మాస్క్‌.. దీంతో మీ పెదాలు హైడ్రేట్‌ అయి మృదువుగా మారిపోతాయి. కొబ్బరినూనె కలబంద, తేనె కలిపి లిప్ మాస్క్‌ తయారు చేయాలి. కాసేపు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలా. ఈ లిప్‌ మస్క్‌తో మీ పెదాలు మృదువుగా మాయిశ్చర్‌ నిలుపుకుంటుంది.

3 /7

బామ్‌.. లిప్‌ బామ్‌ ఎస్‌పీఎఫ్ వాడితే సూర్యుని హానికర కిరణాల నుంచి రక్షణ అందుతుంది. కొన్ని రకాల లిప్‌ బామ్ అందుబాటులో ఉంటాయి. దీన్ని ప్రత రోజూ వాడాలి.

4 /7

హైడ్రేషన్‌.. ప్రతిరోజూ నీరు మన శరీరానికి కావాల్సినంత తసుకోవాలి. ఇది పెదాలకు జీవాన్ని అందిస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తీసుకోవాలి. ఇది మీ పెదాలు పొడిబారడాన్ని తగ్గించేస్తుంది.

5 /7

మీ బెడ్‌రూమ్‌లో హ్యుమిడిఫైయర్ ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా మీ పెదాలు పొడిబారకుండా ఉంటాయి. హ్యుమిడిఫైయర్‌ను బెడ్‌రూం లేదా హాల్‌లో ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా మీ పెదాలు మాయిశ్చర్‌ నిలుపుకుంటాయి.

6 /7

ఆరోగ్యకరమైన డైట్‌.. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన డైట్‌ చేర్చుకున్నట్లవుతుంది. తృణధాన్యాలు కూడా పెదాలను హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్‌, మినరల్స్‌ కూడా ఉంటాయి.

7 /7

వీటన్నిటితో కలిపి సరైన నిద్ర కూడా అవసరం ప్రతిరోజూ కనీసం 8 గంటల నిద్ర మన శరీరానికి అవసరం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)