నామినేషన్ల స్వీకరణ తుది దశకు వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్ధులు ఇంకా నామినేషన్ల దాఖలు చేయలేదు. చివరి రోజు కావడంతో నామినేషన్ల దాఖలు చేసేందుకు తహసీల్దార్ కార్యాలయాల వద్ద అభ్యర్ధులు క్యూకడుతున్నారు
తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నల్లగొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు ఆ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఇంకా దాఖలు చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులు సైతం ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు నామినేషన్లు వేయాల్సి ఉంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి రైతులు బ్యాలెట్‌పోరుకు రెడీ కావడంతో అక్కడ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
ఇక ఏపీ విషయానికి వస్తే ఇప్పటికీ కొన్నిచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. జనసేన, ప్రజాశాంతిపార్టీ పార్టీతోపాటు లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లు వేయనున్నారు.