అనంతపురం: హిందూపురం టీడీపీ అంసెంబ్లీ అభ్యర్ధిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గతంలో కూడా ఇదే స్థానంలో బాలయ్య ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఇక్కడి నుంచి మళ్లీ పోటీ నిలవడం గమనార్హం
అంతకుముందు బాలయ్య సెంటిమెంట్ ప్రకారం హిందుపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. బాలయ్య ర్యాలీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల వాయిస్ నుంచే టీడీపీ పుట్టిందని..దీన్ని అంతం చేయడం ఎవరి తరం కాదంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. కొన్ని దుష్టశుక్తులు పార్టీపై పనిగట్టుకొని పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని..ఎవరెన్ని కుట్రలు చేసిన గెలిచిది టీడీపీయే నన్నారు. గతంలో కంటే ఈ సారి భారీ మెజార్టీ వస్తుందన్నారు. ఈ సారి టీడీపీకి 150 సీట్ల తగ్గకుండా వస్తానయని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు
టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన బాలయ్య