Bonam History in Telugu: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు వేడుకలు మొదలయ్యాయి. ఆదివారం గోల్కోండ బోనాలు మొదలవ్వగా.. బల్కంపేట అమ్మవారి బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు, సింహవాహిని మహంకాళి ఆలయంలో రంగం, భవిష్య వాణి ఉత్సవాలు వరుసగా జరగనున్నాయి. తెలంగాణలో శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలు, ఘట్టాల ఊరేగింపుతో బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. బోనం అంటే ఏమిటి..? బోనాలు ఎక్కడ మొదలయ్యాయి..? బోనాల వెనుక అసలు రహాస్యం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
బోనం అంటే.. మన తెలుగు భాషలో భోజనం పదానికి వికృతి పదం. అమ్మవారికి ప్రేమగా భక్తితో సమర్పించే భోజనాన్ని భక్తులు బోనం అని పిలుచుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాడమాసంలోనే బోనాలు వేడుకలు నిర్వహిస్తారు. ఈ బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు.. మొట్టమొదటిసారి గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆ క్రమంలోనే బోనాల ఉత్సవాలు కూడా మొదలయ్యాయని ఓ కథ ఆరంభం అయ్యాయని పెద్దలు చెబుతారు.
మరో కథనం ప్రకారం.. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా పిలిచే సమయంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించదట. ఈ భయంకరమైన వ్యాధితో ఎంతో ప్రజలు మృత్యువాతపడ్డారట. అమ్మవారుకు ఆగ్రహం రావడంతో ఈ వ్యాధి వ్యాపించిందని భావించిన ప్రజలు.. అమ్మవారిని శాంతింపజేసేందుకు బోనాలు మొదలు పెట్టారని.. ఇక అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బోనాలు అంగంగ వైభవంగా జరుతున్నాయని చెబుతారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే అమ్మవారికి ఎంతో ఇష్టమైన భోజనం, చీర, సారెలు భక్తులు బోనంగా సమర్పిస్తారు. తమ ఇంటి ఆడపడచు ఇంటికి తిరిగి వస్తే ఎంత ప్రేమగా స్వాగతిస్తారో.. అమ్మవారికి కూడా అంతే ప్రేమనురాగాలతో భక్తులు బోనం సమర్పిస్తారు.
గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనాలు ఎత్తడం వందల ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. రెండోవారంలో బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో బోనం ఎత్తుతారు. ఆ తరువాత మూడోవారం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు జరుగుతాయి. నాలుగోవారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి