IND vs ZIM Score Updates: తొలి టీ20లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. రెండో టీ20లో కసితీరా చితక్కొట్టారు. అభిషేక్ శర్మ (100) సెంచరీతో దుమ్ములేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. రుతురాజ్ (77 నాటౌట్), రింకూ సింగ్ (48) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ.. ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్లో తన ధనాధన్ ఇన్నింగ్స్‌లు గుర్తు చేస్తూ ఊచకోత కోశాడు. తొలి హాఫ్ సెంచరీని 33 బంతుల్లో పూర్తి చేసుకున్న అభిషేక్.. రెండో హాఫ్ సెంచరీని కేవలం 13 బంతుల్లోనే ఫినిష్ చేశాడు.
Also Read: Raj Tarun Lavanya: మళ్లీ బాంబు పేల్చిన లావణ్య.. ఒక్కరు కాదు ఇద్దరు హీరోయిన్లతో రాజ్ తరుణ్ సంబంధం
ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రికార్డు కూడా బద్దలు కొట్టాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (47) బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 46 సిక్సర్లు కొట్టాడు. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరుఫున ఆడుతున్న అభిషేక్ శర్మను కావ్య మారన్ బాయ్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు గతంలో రూమర్లు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే గిల్ ఔట్ అయినా.. రుతురాజ్‌తో కలిసి అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ బాదిన అభిషేక్ శర్మ.. తరువాతి బంతికే పెవిలియన్‌కే ఔట్ అయ్యాడు. రుతురాజ్‌తో కలిసి రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రింకూ సింగ్.. జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఎడాపెడా సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 22 బంతుల్లోనే 2 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో యాంకర్ రోల్ పోషించిన రుతురాజ్ గైక్వాడ్.. 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో మజకద్జా, ముజారబాని చెరో వికెట్ పడగొట్టారు. 235 పరుగుల లక్ష్యంతో జింబాబ్వే బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి