British PM House Pics: ఇళ్లు కాదు.. రాజభవనం.. బ్రిటన్ ప్రధాని ఇంటి పిక్స్ చూశారా..!

British Pm House Inside Images: బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కీర్ స్టార్మర్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం పదండి..
 

1 /6

లండన్‌లోని '10 డౌనింగ్ స్ట్రీట్'లో ప్రధాని నివాసం ఉంటుంది. విన్‌స్టన్ చర్చిల్, క్లెమెంట్ అట్లీ, మార్గరెట్ థాచర్, బోరిస్ జాన్సన్, రిషి సునక్ తదితర ప్రధానులు ఇక్కడే ఉన్నారు. లేబర్ పార్టీ విజేత అభ్యర్థి కైర్ స్టార్‌మర్ ఇక్కడ ఉండనున్నారు.   

2 /6

ఈ ఇంటి ఫర్నిచర్ చాలా క్లాసిక్ లుక్‌లో ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ ఓ రేంజ్‌లో ఉంటుంది.   

3 /6

ఫ్లోరింగ్ విషయానికి వస్తే.. అద్భుతమైన డిజైన్‌తో ఉన్న కార్పెట్‌లను ఏర్పాటు చేశారు.   

4 /6

లండన్‌ సాధారణంగా చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే ఇక్కడ ఉష్ణోగ్రత వేడిగా ఉండేందుకు ప్రత్యేకంగా పొయ్యి ఏర్పాటు చేశారు.   

5 /6

ప్రధాని నివాసం రాజభవనానికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఇంటికి రాయల్ టచ్ ఇస్తూ.. పైకప్పుపై అందమైన షాన్డిలియర్లు ఏర్పాటు చేశారు.  

6 /6

గోడలపై వివిధ ప్రాంతాలలో ఆధునిక, పురాతన చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ పెయింటింగ్స్‌లో చాలా వరకు బ్రిటీష్ ప్రధానికి గిఫ్ట్‌గా ఇచ్చినవి ఉంచారుఉ.