Rahu Favourite Zodiac Sign 2024: జ్యోతిష్య శాస్త్రంలో అనేక అంతుచిక్కని గ్రహాలు ఉన్నాయి. అందులో రాహువు, కేతువు గ్రహాలను కీలక గ్రహాలుగా పరిగణిస్తారు. వీటిని అశుభ గ్రహాలు కూడా చెప్పుకుంటారు. ఈ రెండు గ్రహాలు అప్పుడప్పుడు తిరోగమనం చేస్తూ ఉంటాయి. ఈ రెండు చెడు గ్రహాలు కావడంతో అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో రాహువు గ్రహం సంచారం చేయడం వల్ల శుభ పరిణమాలు కూడా కలుగుతాయి. అలాగే కొన్ని రాశులవారికి ఎవ్వరూ ఊహించని శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే రాహువు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శుభ, అశుభ ప్రయోజనాలను అందిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాహువు గ్రహాన్ని ఊహించని సంఘటనలకు కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రాహువు గ్రహం శుభస్థానంలో ఉంటే విపరీతమైన లాభాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే తీవ్ర సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ గ్రహం వ్యక్తుల జాతకాల్లో మూడు లేదా ఆరవ స్థానంలో ఉంటే అన్ని సానుకూల ఫలితాలు వస్తాయని వారంటున్నారు. రాహువు ప్రభావం వల్ల వక్తులు ఎలాంటి నిర్ణయాలైనా సులభంగా తీసుకోగలుతారు. అంతేకాకుండా పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
జ్యోతిష్య శాస్త్రంలో తెలిపిన వివరాల ప్రకారం, రాహువు దశమ స్థానంలో ఉంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో సకల సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు వీరు అనేక శుభవార్తలు కూడా వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే అన్ని రాశులవారికి జాతకంలో 11వ స్థానంలో ఉన్న ఈ శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
రాహువు మహాదశలో ఉన్న వ్యక్తులకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ దశ దాదాపు 18 సంవత్సరాల పాటు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఈ సమయంలో అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ సమయాల్లో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
సింహ రాశి:
రాహువు గ్రహానికి సింహ రాశి అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతి సారి వీరికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు జీవితంలో వచ్చే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. సానుకూల మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా ప్రతి రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే మానసిక ఒత్తిడి నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి