Uttar pradesh serial bride found hiv 3 duped husbands: కొందరు పెళ్లి పేరుతో అనేక మోసాలకు పాల్పడుతున్నారు.ఇప్పటి వరకు పెళ్లి పేరుతో అబ్బాయిలు మోసాలకు పాల్పడేవారు. సాఫ్ట్ వేర్ జాబ్ ఉందని, కోట్లలో ఆస్తులున్నాయని, అమెరికాలో ఉద్యోగం ఉందని మ్యాట్రిమోనీలో ఫోటోలు, డిటెయిల్స్ లు అప్ లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తీరా కోట్లరూపాలు కట్నాలుగా ఇచ్చి,కొన్నిరోజులు గడిచాక మోసాపోయామని అమ్మాయిలు పోలీసుల చుట్టు తిరుగుతుండే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. అమ్మాయిలది డిమాండ్ నడుస్తోంది.
Read more:Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?
ఇదే అదనుగా భావించిన కొందరు గ్యాంగ్ లు జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించడానికి పెళ్లి పేరుతో అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తున్నారు. వీరు మ్యాట్రిమోనీలో లేదా బ్రోకర్ల ద్వారా సంబంధాలు చేసుకుంటారు. పెళ్లి చేసుకుని కొన్నిరోజులు బాగా ఉండి.. రాత్రి రాత్రే బంగారం, డబ్బులతో మాయమైపోతుంటారు. ఇప్పటికే ఇలాంటి అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. కానీ ఇక్కడ మాత్రం వేరైటీ పెళ్లి మోసాలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
పూర్తివివరాలు..
ఇరవై ఏళ్ల ఒక అందమైన యువతి,పెళ్లికానీ యువకులు గాలం వేసేది. తన అంద చందాలతో వారిని మాటల్లో పెట్టి పెళ్లికి ఒప్పించేది. తీరా పెళ్లి జరిగాక కొన్నిరోజుల తర్వాత డబ్బులు, బంగారంతో ఉడాయించేది. ఈ విధంగా సదరు యువతి ఉత్తర ప్రదేశ్ ,ఉత్తర ఖండ్ లకు చెందిన అనేక మందిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీవల సదరు యువతిని, మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మహిళను జైలుకు తరలించారు. ఆమెకు ఆస్పత్రిలో టెస్టులు చేయగా హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిపింది.
ఈ క్రమంలో ఈ గ్యాంగ్ పై వీరి చేతిలో పెళ్లిపేరుతో.. మోసం చేసిన ముగ్గురు యువకులకు కూడా పోలీసులు సమాచారం అందించారు. దీంతో వారు కూడా హెచ్ఐవీ టెస్టులు చేయించుకున్నారు. అనూహ్యంగా వారికి కూడా హెచ్ఐవీ పాజిటీవ్ అని బైటపడింది. దీంతో పోలీసులు.. ఇంకా యువతి వలలో ఎంత మంది మగాళ్లు పడ్డారో.. ఎందరితో శారీరకంగా కలిసిందో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దీంతో యువతితో, ఎంజాయ్ చేసిన వారు కొందరు మాత్రం టెన్షన్ పడుతున్నారంట. సదరు మహిళ పట్ల కక్కుర్తిగా ప్రవర్తించడం వల్ల తమ జీవితం నాశనం అయిపోయిందని కూడా కొందరు బాధపడుతున్నారంటా.. ఈ ఘటన ఇప్పుడు ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లో హట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి