Rashmika Mandanna Ayushmann Khurrana: స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఒక సినిమా తర్వాత మరొక సినిమా ఆఫర్ అందుకుంటూ కెరియర్ లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకు వెళుతుంది. ఈ మధ్యనే బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో.. రష్మిక మంచి బ్లాక్ బస్టర్ అందుకుంది.
ప్రస్తుతం హిందీలో రష్మిక.. చావా అనే ఒక సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్.. హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు రష్మికకి.. ముచ్చటగా బాలీవుడ్ లో ముచ్చటగా.. మూడో ఆఫర్ కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్.. వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ అంటూ ఒక హారర్ కామెడీ యూనివర్స్ సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యనే ముంజియా సినిమాని నిర్మించి.. మంచి హిట్ అందుకున్న దినేష్ విజన్.. ఇప్పుడు ఆ సినిమాకి దర్శకత్వం వహించిన ఆదిత్య సప్పోదర్ తోనే ఈ వాంపైర్స్.. ఆఫ్ విజయ్ నగర్ సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోగా ఆయుష్మాన్ ఖురానాని.. ఎంపిక చేయగా హీరోయిన్ పాత్ర కోసం.. రష్మిక మందన్నని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పని చేయటం.. రష్మికకి ఇదే మొదటిసారి. ఆయిష్మాన్ కరణ్ జోహార్ నిర్మాణంలో ఒక సినిమాతో బిజీ గా ఉన్నారు. అంతేకాకుండా బోర్డర్ 2 అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ సినిమా పట్టాలెక్కనుంది.
ఈలోపు రష్మిక మందన్న కూడా పుష్ప 2.. పూర్తి చేసి సికిందర్ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతోంది. వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు.. త్వరలో వెలువడనున్నాయి. ఏదేమైనా బాలీవుడ్ లో రష్మిక స్పీడ్ చూస్తున్న.. ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మరోవైపు రష్మిక తెలుగులో రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ సినిమాలలో కూడా నటిస్తుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్.. సరసన కుబేర సినిమాలో కూడా రష్మిక కనిపించనున్న సంగతి తెలిసిందే.
Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి