Deputy CM Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో వైరల్..

Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఒక మహిళ హల్ చల్ చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్.. తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేసింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 25, 2024, 01:45 PM IST
  • పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు హల్ చల్..
  • అలర్ట్ అయిన పోలీసులు..
Deputy CM Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో వైరల్..

Woman suicide attempt at deputy cm pawan kalyan office: ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనను గాడిలో పేట్టే పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో.. అక్రమకట్టడాలు, ప్రభుత్వ సొమ్ములను  ఇష్టమున్నట్లు ఖర్చులు పెట్టడం వంటిఘటనలపై ప్రత్యేకంగా టార్గెట్ చేశారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ అక్రమ భవనాలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తుంది. దీనిలో భాగంగా..అనేక జిల్లాలలో అక్రమంగా నిర్మించిన వైసీపీ ప్యాలెస్ లపై ఆయా అధికారులు నోటీసులు జారీచేశారు.

 

మరోవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కూడా పాలనపై తనదైన మార్కుచూపించేలా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డైనమిక్ అధికారి కృష్ణ తేజ ఐఏఎస్ ను తన ఓఎస్టీగా నియమించుకున్నారు. అధికారులు పారదర్శకంగా ఉంటే.. డెవలప్ మెంట్ ఫలాలు ప్రజల వరకు చేరతాయని పవన్ చెప్తుంటారు. ఇదిలా ఉండగా..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాలు..

రాజ మండ్రికి చెందిన దంపతులు నిన్న(సోమవారం)సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల,సెక్యురిటీ కారణాల వల్ల అక్కడున్న వారు అనుమతించలేదు. ఈ క్రమంలో కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తమ బాధలు చెప్పుకొవాలని దంపతులు భావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా వారికి నిరాశ ఎదురవ్వడంతో.. అక్కడ ఉన్న ఒక భవంతి పైకి ఎక్కి హల్ చల్ చేశారు. భవనం నుంచి దూకడానికి ప్రయత్నించారు.

వెంటనే అలర్ట్ అయిన అధికారులు చాకచక్యంగా వ్యవహరించి, మహిళలను కిందకు తీసుకొచ్చారు. సదరు బాధితుల గోస ఏంటంటే.. రాజమండ్రిలో.. తమ 1200 గజాల భూమిని అక్కడి వైసీపీ లేడీ కార్పోరేటర్ కబ్జాచేసుకున్నారని వాపోయింది. స్థానిక అధికారులకు, పోలీసులకు చెప్పిన కూడా పట్టించుకోలేదని మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలని నిన్న సీఎం చంద్రబాబును కలవాలనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు.

Read more: Nita ambani: చాట్ తింటూ కాశీలో సందడి చేసిన నీతా అంబానీ.. వైరల్ గా మారిన వీడియో.. 

ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి వైసీపీ అక్రమాలను చెప్పడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈరోజు కూడా.. పోలీసులు ఆ దంపతుల్ని క్యాంప్ ఆఫీస్ లోకి అనుమతించలేదు. అంతేకాకుండా.. వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వైపు తరలించారు. ఇక పవన్ కళ్యాణ్‌ని కలిసే ఛాన్స్ రాదేమో అని  బాధితురాలు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
 

 

Trending News