Vijay Antony - Toofan: హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘తుఫాన్’. ఈ మూవీని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో "తుఫాన్" సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు విజయ్ మిల్టన్. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరకున్న ‘తుఫాన్ సినిమాను త్వరలో గ్రాండ్ థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ‘తుఫాన్’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'వెతికా నేనే నా జాడే' రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. 'వెతికా నేనే నా జాడే' పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా మ్యూజిక్ అందించారు. 'వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ..కాలం కరిగిపోయే తీరం చేరుతూ' అంటూ ఆలోచింపజేసే లిరిక్స్ తో సాగు పాటకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తుఫాన్’ సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
#Toofan -The Search of Soul & Discovery of New Friends Begins!
Here’s the second single #VetihkaNeneNa 🦮🚶
Song Out Now 🔗 https://t.co/dg48tJJAU9
🎬 @vijaymilton@vijayantony @realsarathkumar #Sathyaraj @akash_megha @dhananjayaka @ambarpruthvi @achurajamani @dafusiamusic pic.twitter.com/BklivJXvOp
— GSK Media (@GskMedia_PR) June 21, 2024
విజయ్ ఆంటోని విషయానికొస్తే.. తెలుగులో డాక్టర్ సలీమ్’ సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘పిచ్చైకారన్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాను తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్ తో విడుదలై సంచలన విజయం సాధించాడు. అప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉండే విజయ్ ఆంటోని ఆ తర్వాత.. హీరోగా సెటిలైపోయాడు. అంతేకాదు తమిళంతో పాటు తెలుగులో ఈయన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. తాజాగా విజయ్ ఆంటోని నటిస్తోన్న ‘తుఫాన్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీతో పాటు శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్,డిజైనర్ - తండోరా చంద్రు,యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్,ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్,మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ,ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి,డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ, పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్),నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్.
Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter