Unlucky Zodiac Signs In 2025: తొమ్మిది గ్రహాలలో ఎంతో ముఖ్యమైన గ్రహం శని.. ఈ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే శని గ్రహాన్ని న్యాయదేవతగా కూడా పిలుస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం మకర, కుంభ రాశులకు అధిపతిగా ఉంటుంది. మేష రాశివారికి నీచ స్థితిలో ఉంటుంది. అయితే ఈ శని గ్రహం కుంభ రాశిలో ఉంది. శని ఈ గ్రహంలో ఉండడం వల్ల కర్కాటక రాశి, కుంభ రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడం వల్ల రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది. అయితే ప్రతి వ్యక్తి ఒక్కసారైనా శని సడేసతిని ఎదుర్కోంటారు. అయితే ఈ ఏలినాటి శని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జన్మరాశిలో శని ఉచ్ఛస్థితి ఉంటే అనేక ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా వెంటనే పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఈ శని దేవుడిని న్యాయ దేవతగా కూడా చెప్పుకుంటారు. అయితే జాతకంలో శని గ్రహం శుభస్థానంలో ఉంటే శుభఫలితాలు, అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి, వృశ్చిక రాశులవారు ఏలినాటి శని నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శని గ్రహం రాశి సంచారం చాలా అరుదుగా చేస్తుంది. ఈ గ్రహం దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. అందుకే శని గ్రహం మొత్తం రాశులు తిరగడానికి దాదాపు 30 సంవత్సరాల పాటు టైమ్ పడుతుంది. ఈ గ్రహం మకర రాశిని వదిలి 17 జనవరి 2023 సంవత్సరంలో కుంభ రాశికి ప్రవేశించింది. అయితే ఇది వచ్చే సంవత్సరం మార్చి 29న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
2025 సంవత్సరంలో ఏలినాటి శని నుంచి కర్కాటక, వృశ్చిక రాశివారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అలాగే శని ధనస్సు రాశిలోకి సంచారం చేస్తాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మకరరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. కుంభరాశిలో శని అర్ధ శని రెండవ దశ, మీనరాశిలో శని ప్రథమార్ధంలో ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి