Reduce Dementia: ఈ 5 ఆహారాలు డిమెన్షియా సమస్యను మీ దరిచేరనివ్వవు..

5 Foods Reduce Dementia: మెదడు పనితీరు మందగించే సమస్య డిమెన్షియా వల్ల వస్తుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిలియన్ల మంది వృద్ధులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని రకాల డైట్ మార్పులు చేసుకోవాలి. దీంతో ఈ ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా న్యూట్రియన్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ లో ఉండాల్సిందే. ఇది మెదడు ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తాయి, సమస్యను తగ్గిస్తాయి. అలాంటి ఐదు ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.
 

1 /5

ఆకుకూరలు.. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకి మంచివి. ముఖ్యంగా ఈ ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ప్రాణాంతక ఫ్రీ రాడికల్ సమస్య నుంచి కాపాడి మంట సమస్యను తగ్గిస్తాయి. దీంతో వయస్సురీత్యా వచ్చే మెదడు సమస్యలు తగ్గిపోతాయి.

2 /5

బెర్రీలు.. బెర్రీలు పండ్లలో కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్‌ ఉండటం వల్ల మంట సమస్యను తగ్గిస్తాయి. మెదడు పని తీరని మెరుగు చేస్తాయి.

3 /5

కొవ్వు చేప.. ముఖ్యంగా కొవ్వు ఉండే సాల్మన్, ట్రౌట్, సార్డినెన్స్‌, మేకరల్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఈపిఏ, డిహెచ్ఏ మెదడు పనితీరుని ప్రోత్సహిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ మెదడు కణాలను ఆరోగ్యవంతంగా పనిచేసేలా చేస్తాయి సమస్య తగ్గుతుంది.

4 /5

గింజలు, విత్తనాలు.. గింజలు, విత్తనాలు ముఖ్యంగా ఫ్లాక్ సీడ్స్, బాదాం, వాల్నట్స్ వంటివి మీ ఇంట్లో పెద్దవారి డైట్లో చేర్చాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయి.

5 /5

తృణధాన్యాలు.. ఓట్స్, క్వినోవా, బార్లీ, బ్రౌన్ రైస్ వంటివి పెద్దవాళ్ళ డైట్ లో చేర్చాలి ఇందులో తక్కువ శాతం గ్లైసే మిక్స్ సూచి ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ బి అంటే ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇది బ్రెయిన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )