Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు అధికార వైసీపికి గట్టి షాక్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు, బీసీ మంత్రంతో రంగంలోకి దిగిన వైయస్ఆర్సీపీ.. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ముందు కుదేలైంది. చరిత్రలో ఎన్నడు లేనంత ఘోరంగా ఓటమి పాలైయింది. గత ఎన్నికల్లో వైసీపి దెబ్బకు తెలుగు దేశం పార్టీ ఎలా కృంగిపోయిందో ఈ సారి ఎన్నికల్లో సేమ్ సీన్ రివర్స్ అయింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వని చెప్పిన జనసేనాని.. అనుకున్నట్టే చేసి ఏపీలో కూటమికి భారీ విజయం చేకూర్చి పెట్టారు. ఈ ఎన్నికల్లో మెయిన్ గేమ్ ఛేంచర్ గా నిలిచారు. అయితే ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో సాధించిన పెట్టిన
పవన్ కళ్యాణ్ కు ఏపీలో 12న ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. డిప్యూటతో పాటు హోం శాఖ బాధ్యతలను పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశాలున్నాయి.
ఈ ఎన్నికలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాదు 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన నిలిచింది. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో చేరని జనసేన .. ఏపీ మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో 4 గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అటు బీజేపీకి కూడా మంత్రి వర్గంలో రెండు సీట్లు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి వర్గంలో చేరి ఆ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి వర్గంలో చేరుతారా అనేది కూడా డౌటే. 12వ తేదిన చంద్రబాబు ప్రమాణంతో పాటు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే సరి. లేకపోతే ఈ సారికి మంత్రివర్గంలో చేరకుండా బయట నుంచి జనసేన మద్ధతు ఇచ్చే అవకాశాలున్నాయి. లేకపోతే పవన్ కాకుండా.. తన ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరుస్తారా లేదా అనేది చూడాలి.
Also read: kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook