Modi Cabinet 2024: నరేంద్ర మోడీ క్యాబినెట్లో నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు..

Modi 3.O Cabinet:  ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. భారత తొలి ప్రధాన మంత్రి నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనం రేపారు. అయితే మోడీ ఫస్ట్ టైమ్ ప్రైమ్ మినిష్టర్ అయినప్పటి నుంచి ఆయన క్యాబినేట్ లో నిర్మలా సీతారామన్ కొనసాగుతూ రావడం విశేషం

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 10, 2024, 10:52 AM IST
Modi Cabinet 2024: నరేంద్ర మోడీ క్యాబినెట్లో నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు..

Modi 3.O Cabinet: ఆదివారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మొత్తంగా 9 అంకె వచ్చేలా 72 మంది ఆమాత్యులుగా కొలువుతీరారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో నిర్మల సీతారామన్, అన్నపూర్ణ దేవిలు మాత్రమే క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మిగతా ఐదుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మోడీ 2014లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన క్యాబినేట్ లో కొనసాగుతున్న ఏకైక మహిళా మంత్రి నిర్మల సీతారామన్ కావడం ఒక రికార్డు అని చెప్పాలి. అంతేకాదు ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ జైరామ్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ ల తర్వాత 6వ మంత్రిగా నిర్మలా సీతారామన్  ప్రమాణ స్వీకారం చేసారు. అంతేకాదు మోడీ తన క్యాబినేట్ లో ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది తెలుస్తోంది.  

2014లో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో నిర్మలా పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2017లో ఆమెకు అనూహ్యంగా మనోహర్ పారికర్ .. గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న రక్షణ శాఖ మంత్రి  పోస్ట్ ను నిర్మలమ్మకు అప్పగించారు.

2019 జనరల్ ఎలక్షన్స్ తర్వాత అరుణ్ జైట్లీ అనారోగ్య కారణాల వల్ల నిర్మలమ్మ ఆర్దిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగారు. అంతకు ముందు ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉంటూ ఈ బాధ్యతలు నిర్వహించారు. తాజాగా జరిగిన మోడీ క్యాబినేట్ లో 2014, 2019, 2024లో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. మరి ఈ సారి క్యాబినేట్ లో నిర్మలా సీతారామన్ కు ఆర్ధిక శాఖను కేటాయిస్తారా.. లేకుంటే మరేదైనా కీలక శాఖ బాధ్యతలను అప్పగిస్తారా అనేది చూడాలి.

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News