Healthy Fruits: బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పకుండా తీసుకోవల్సిన 5 ఫ్రూట్స్ ఇవే

ప్రతి ఒక్కరికీ బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ముఖ్యమైంది. బ్రేక్‌ఫాస్ట్ హెల్తీ ఫ్రూట్స్ ఉంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చాలామంది ఉదయం పరాఠా, పూరీ, దోశ వంటివి తింటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ ప్రోటీన్, ఫైబర్ ఉండే ఫుడ్స్ ఉండాలి. 

Healthy Fruits: ప్రతి ఒక్కరికీ బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ముఖ్యమైంది. బ్రేక్‌ఫాస్ట్ హెల్తీ ఫ్రూట్స్ ఉంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చాలామంది ఉదయం పరాఠా, పూరీ, దోశ వంటివి తింటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ ప్రోటీన్, ఫైబర్ ఉండే ఫుడ్స్ ఉండాలి. 

1 /5

బొప్పాయి బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పెపైన్ ఎంజైమ్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బొప్పాయి బరువు తగ్గించేందుకు సైతం అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

2 /5

ఆరెంజ్ ఆరెంజ్‌లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇమ్యూనిటీని బలోపేతం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.  ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

3 /5

బెర్రీస్ స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్‌బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అదికంగా ఉంటాయి. 

4 /5

అరటి పండ్లు అరటి పండ్లలో పొటాషియం, విటమిన్ బి6 చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్‌స్టంట్ ఎనర్జీని అందిస్తాయి. ఇందులో సహజసిద్దమైన షుగర్ ఉంటుంది. రోజు ప్రారంభం అరటి పండ్లతో అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. 

5 /5

ఆపిల్ ఆపిల్‌లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ నిర్ణీత మోతాదులో  తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.