Chandrababu as Kingmaker: నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ఎన్డీయే మిత్రపక్షాలది ఈసారి కీలకపాత్ర కానుంది. బీజేపీకు స్వయంగా మెజార్టీ లేకపోవడమే కాకుండా ఎన్డీయేకు మేజిక్ ఫిగర్ కంటే కొద్దిగా ఎక్కువ సీట్లు రావడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మరోసారి కీలకం కానుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్రంలో మరోసారి చక్రం తిప్పనున్నారు.
కేంద్రంలో మరోసారి బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనుంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి బీజేపీకు ఒంటరిగా 240 సీట్లే రావడంతో ఎన్డీయే మిత్రపక్షాలు కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ, చంద్రబాబు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీలు ప్రధానంగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు పార్టీల ఎంపీ సీట్లు మినహాయిస్తే ఎన్డీయే మేజిక్ ఫిగర్ 272కు తగ్గిపోతుంది. అందుకే ఈ రెండు పార్టీలు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పనున్నాయి. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో చక్రం తిప్పిన చంద్రబాబుకు మళ్లీ ఆ అవకాశం వచ్చింది. తెలుగుదేశంకు 16 ఎంపీ సీట్లు, మిత్రపక్షం జనసేనకు 2 మొత్తం 18 సీట్లతో ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించవచ్చు.
కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో చేరి తగిన మంత్రి పదవులు డిమాండ్ చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో స్పీకర్ పోస్టును కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఈసారి అదే పోస్టు కోరవచ్చు. దాంతోపాటు కీలకమైన మూడు మంత్రిత్వ శాఖలు కోరనున్నట్టు సమాచారం. రవాణా, జలశక్తి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖల్లో మూడు శాఖలు కోరవచ్చు. చంద్రబాబు డిమాండ్లు పూర్తిగా తీర్చలేకున్నా సాధ్యమైనంతవరకూ ఆమోదించే అవకాశాలే కన్పిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ అగ్రనేతలు మోదీ, షాలకు మరో ప్రత్యామ్నాయం లేదు.
అదే సమయంలో నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ సైతం కీలక శాఖలకు పట్టుబట్టనుంది. స్పీకర్ పోస్టు కోసం తెలుగుదేశంతో పాటు జేడీయూ కూడా పట్టుబట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకే ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చంద్రబాబు, నితీష్ కుమార్ హవా, ప్రాబల్యం స్పష్టంగా కన్పించనుంది.
Also read: Monsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook