Telangana Group 1 Hall Tickets: ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి మరో కీలక ప్రకటన వెలువడింది. గతంలో రద్దయిన గ్రూప్ 1 పరీక్ష మరోసారి నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. జూన్ 9వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
Also Read: TS Formation Day 2024: సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్.. సోనియా గాంధీ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే..?
మొత్తం 536 పోస్టులతో గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మార్పులు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనుంది. పరీక్షకు అర గంట ముందే అంటే 10 గంటల వరకే అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమతించరు. ఈ విషయాన్ని గ్రహించాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.
Also Read: TS Formation Day 2024: గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టీ.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..
డౌన్‌లోడ్ చేసుకోవడం ఇలా..
టీఎస్‌పీఎస్ వెబ్‌సైట్ తెరవాలి. అక్కడ మెనూలో గ్రూప్ 1 హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది.
- గ్రూప్ 1 హాల్ టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఒక పేజీ తెరుచుకుంటుంది. అందులో మీ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీని పొందుపర్చాలి.
- అనంతరం అక్కడ కనిపించే క్యాపిచాను రాసి డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తే హాల్ టికెట్ తెరచుకుంటుంది.
టీఎస్‌పీఎస్ ఐడీ తెలియకుంటే..
ఐడీ తెలియకుంటే టీఎస్‌పీఎస్ వెబ్‌సైట్ హోం పేజీ తెరవాలి
- ఆ పేజీలో క్యాండిటేట్ సర్వీసెస్ అనే విభాగంలో 'నో యువర్ టీఎస్‌పీఎస్ ఐడీ' అని ఉంటుంది.
- అక్కడ క్లిక్ చేస్తే మరో పేజీ తెరుచుకుంటుంది.
- అక్కడ ఆధార్ నంబర్/ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ / అభ్యర్థి పేరు నమోదు చేయాలి.
- అనంతరం పుట్టిన తేదీ పొందుపర్చాలి.
- ఆ తర్వాత కనిపించే క్యాపిచాను బాక్స్‌లో రాసి గెట్ డిటైల్స్ అని క్లిక్ చేయాలి.
- మీ టీఎస్‌ఎస్సీ ఐడీ తెరుచుకుంటుంది.
- ఆ ఐడీ నంబర్‌ను రాసుకుని మళ్లీ హాల్ టికెట్ విభాగంలోకి వెళ్లి ఆ నంబర్‌ను పొందుపర్చి మిగతా వివరాలు నింపితే మీకు హాల్ టికెట్ వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter
Group 1 Hall Tickets: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఇలా..