Swapna shastra phal: మనకు కలలో కన్పించే వాటిని బట్టి జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయని కూడా జ్యోతిష్యులు చెబుతుంటారు. స్వప్నాలు పడిన సమయంను బట్టి కూడా కలల ఫలితాలు ఉంటాయి.
జ్యోతిష్య పండితుల ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక గొప్ప అర్ధం దాగి ఉంటుంది. ముఖ్యంగా కలల శాస్త్రం లేదా స్వప్న శాస్త్రం మన డైలీ లైఫ్ మీద ఎంతో ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కలలు కూడా బ్రాహ్మీమూహుర్తంలో పడే కలలు ఎక్కువగా నిజమవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పండితులు అభిప్రాయపడుతుంటారు. అందుకే ఉదయం లేవగానే.. మనకు పడిన కలల గురించి ఎక్కువగా చర్చించుకొవద్దని అంటారు.
కొందరికి కలలో గుర్రం మీద, ఏనుగుల మీద స్వారీ చేసినట్లు కలలు పడతాయి. ఇది రాబోయే ఐశ్వర్యానికి ప్రతీక అని చెబుతుంటారు. ఇక మరికొందరికి కలలో పాములు కనపబడతాయి. ముంగీసలు కూడా కనపడుతుంటాయి. దీని వల్ల కొన్నిరకాల ఇబ్బందులు తలెత్తుతాయని అంటారు.
ఇక స్వప్నంలో ఎలుగు బంటీ మీద స్వారీ చేసినట్లుకలలు వస్తే, అది మంచిదని కూడా చెప్తారు. అది ఊహించని లక్కీ యోగానికి గుర్తుగా చెబుతారు. కలలో గొడవలు పడినట్లు, స్వప్నం పడితే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో వాగ్వాదానికి దిగోద్దని అంటారు.
కలలో ఎవరైన చనిపోయినట్లు కల పడితే.. అలాంటి వారికి కలిగే ఆపద తప్పిపోయినట్లు కూడా చెబుతుంటారు. కలలో ప్రమాదాలు జరిగితే.. వెంటనే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకొవాలి..
కలలో కనుక.. ఎవరికైన మలం కన్పిస్తే లేదా మలంలో పడ్డట్లు కన్పిస్తే.. అలాంటి వారు.. తంతే బూరలో బుట్టలో పోయి పడ్డట్లు వారీ జీవితం మారిపోతుందంట. అలాంటి వారికి గొప్ప అవకాశాలు వెతుక్కుంటు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)