వైసీపీ చీఫ్ జగన్ తో టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. లోటస్ పాండ్ వేదికగా జరగుతున్న ఈ భేటీలో టీఆర్ఎస్, వైసీపీ ముఖ్యనేతలు కూడా ఉన్నారు. కాగా ఈ భేటీలో ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ పై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పై జగన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనే దానిపై సర్వత్వా ఉత్కంఠత నెలకొంది.
బీజేపీతో వైసీపీ కుమ్మకైందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలో ఫెడరల్ దారి పడుతున్న టీఆర్ఎస్ పార్టీ నేతలతో భేటీ నిర్వహిస్తుండటం గమనార్హం. చంద్రబాబు విమర్శలకు చెక్ పెట్టేందుకు జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
ఈ భేటీ అనంతరం జగన్, కేటీఆర్ లు జాయింట్ మీడియా సమావేశం నిర్వహించననున్నట్లు తెలిసింది. ఈ ప్రెస్ మీట్ లో జగన్ ఫెడలర్ ఫ్రంట్ పట్ల తన వైఖరిని స్పష్టం చేస్తారని రాజకీయవర్గాల్లో చర్చనడుస్తోంది.
ఈ భేటీ సందర్భంలో ఏపీలో రాజకీయాలపై చర్చ జరిగే అవకాశముంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్న కేసీఆర్..ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావ చూపుతారో ఈ భేటీ ద్వార తేలిపోనుంది.