జగన్ పై కోడికత్తి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రావు కు వారం రోజుల ఎన్ఐఏ కస్టడీకి విజయవాడ కోర్టు అంగీకరించింది. కోడికత్తి దాడి కేసులో హైకోర్టు ఆదేశాలతో ఏపీ పోలీసులు కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ విచారణ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ రోజు విజయవాడ కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా..కోర్టు ఎన్ఐఏ కష్టడీకి ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చింది
షరతులతో కూడిన కష్టడీ..
ఇదే క్రమంలో ఎన్ఐఏకు కోర్టు కొన్ని షరతులు విధించింది. నిందితుడిపై థార్డ్ డిగ్రీ ప్రయోగించరాదని న్యాయస్థానం పేర్కొంది. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలో విచారణ ఎదొర్కోవచ్చని తెలిపింది. అలాగే నిందితుడికి మూడు రోజులకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయ స్థానం ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో శ్రీనివాసరరావును వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ రోజు సమయం మించి పోవడంతో నిందితుడు శ్రీనివాస్ రావును రేపు కష్టడిలోకి తీసుకోవాలని ఎన్ఐఏ నిర్ణయించింది.