బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బయోపిక్ ల పరంపరం కొనసాగుతోంది. ఇటీవలె తెరపైకి వచ్చిన సంజయ్ దత్ బయోపిక్ సక్సెస్ అవడంతో.. ఇప్పుడు తాజాగా బయోపిక్ అంశం తెరపైకి వచ్చింది. భారత దేశానికి క్రికెట్ విభాగంలో మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ జీవితం ఆధారం చేసుకొని బయోపిన్ ను రూపొందిస్తున్నారు. తెరపైకి తీసుకెళ్లడానికి దర్శకుడు కబీర్ ఖాన్ సన్నాహాలు చేస్తున్నాడు. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెల్చుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు '83' అనే టైటిల్ ను ఖరారు చేశారు
టైటిల్ ఖరారు చేసుకున్న చిత్రయూనిట్ నటినటుల కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఈ బయోపిక్ లో నటించేందుకు ఇటీవలె పెళ్లి చేసుకున్న పద్మావత్ జంటను సంప్రదించారట. దీనికి రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కపిల్ దేవ్ పాత్ర కోసం రణ్ వీర్ ను ఎంపిక చేసుకోగా.. కపిల్ దేవ్ భార్య పాత్ర 'రోమి భాటియా' పాత్ర కోసం దీపికను నటిస్తున్నారు. ఈ విషయంలో రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.