సిడ్నీ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులో స్థానం సంపాదించిన 13 సభ్యులు జాబితా విడుదల చేసింది. గత జట్టుతో పోల్చితే రోహిత్ శర్మ, ఫేసర్ ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. రోహిత్ కు కూతరు పుట్టిన నేపథ్యంలో హుటాహుటిన స్వదేశానికి బయలుదేరారు. దీంతో అతన్ని జట్టులో తీసుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోలేదు. ఫిట్నెస్ లేని కారణంగా ఇషాంత్ శర్మను పక్కన పెట్టింది. గత మూడు టెస్టుల్లోనూ అతని నామమాత్రంగానే రాణించిన విషయం తెలిసిందే. కాగా ఇషాంత్ స్థానంలో ఉమేష్ యావద్ కు చోటు కల్పించింది. రోహిత్, ఇషాంత్ లను మినహాయించి మిగిలిన సభ్యులకు నాల్గో టెస్టులో చోటు దక్కింది.
నాల్గో టెస్టుకు భారత జట్టు ఇదే :
విరాట్ కోహ్లీ (కెప్టెన్),
అజింక్యా రహానే (వైఎస్ కెప్టెన్)
కేఎల్ రాహుల్
మయాంక్ అగర్వాల్
చటేశ్వర పుజారా
హనుమ విహారి
రిషబ్ పంత్
రవీంద్ర జడేజా
కుల్దీప్ యాదవ్
రవిచంద్రన్ అశ్విన్
మొహ్మద్ షమీ
జస్మీత్ బుమ్రా
ఉమేష్ యాదవ్
నాల్గో టెస్టులోనూ అశ్విన్ డౌట్..
తొలి టెస్టు సమయంలో కడపునొప్పితో జట్టుకు దూరమైన స్పిన్ దిగ్గజం అశ్విన్ ఇంకా కోలుకోలేదు..అయినప్పటికీ అతని పేరు బీసీసీఐ ప్రకటించింది. అశ్విన్ కోలుకోని పక్షంలో కుల్దీప్, జడేజా అతనికి ప్రత్యామ్నాయంగా ఉన్నారు. మ్యాచ్ ప్రారంభం సమయానికి అశ్విన్ కోలుకుంటే తుది జట్టులో అతన్ని తీసుకునే అవకాశముంది.. కాగా ఈ రోజు ఉదయం టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ చిట్టచివరి టెస్టులో అశ్విన్ లేకుండా బరిలోకి దిగడం బాధిస్తోందని పేర్కొనడం గమనార్హం. అశ్విన్ ఇప్పుడే కోలుకునే అవకాశం లేదనే సంకేతాలు కోహ్లీ ఇచ్చాడు.
ఉత్కంఠభరిత మ్యాచ్..
ఆసీస్-కోహ్లీసేన సమరం నాల్గో టెస్టు సమయం సిడ్నీ గ్రౌండ్ లో జరనుంది. నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి టీమిండియా బమటపడినప్పటికీ.. టెస్టు సిరీస్ నెగ్గాలనే లక్ష్యంతో కోహ్లీ సేన బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ కోహ్లీసేన గెలిచినట్లయతే అది చరిత్ర సృష్టించినట్లే.. మరోవైపు నాల్గో టెస్టులో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఆసీస్ కసితో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఈ సారి గట్టిపోటీ ఇచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీమిండియా- ఆసీస్ మధ్య జరిగే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుందని క్రీడా విశ్లేషకలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.