AP TS Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఏయే జిల్లాల్లో వర్షసూచన ఉందో తెలుసుకుందాం.
మరాఠ్వాడ నుంచి గోవాలోని కోమరిన్ వరకూ విస్తరించిన ద్రోణి తూర్పు మద్యప్రదేశ్ నుంచి విదర్బ, మరాఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్ ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశముంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా ఇవాళ, రేపు పిడుగులతో వర్షాలు పడనున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చు. రేపు జరగనున్న పోలింగ్‌పై వర్షాలు ప్రభావం చూపించవచ్చు.
Also read: Voter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్లోడ్ చేయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook