/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

గుంటూరు: సీఎం చంద్రబాబు విధానాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ తనకు నచ్చని వారు ఏం చేసినా విమర్శించడం  చంద్రబాబు సహజ లక్ష్మణమని ఎద్దేవ చేశారు. విభజన చట్టానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం హైకోర్టును విభజిచిందని..దీన్ని కూడా తప్పుబడితే ఎలా అంటూ ప్రశ్నించారు. కోర్టు విభజన నేపధ్యంలో న్యాయ వ్యవస్థను సీఎం క్యాంపు కార్యాలయంలో పెట్టాలని నిర్ణయించడం దారుణమైన చర్య అన్నారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థను చంద్రబాబు తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకంటున్నారనే దాని ఇది ఒక నిదర్శమని ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానంపై  రాష్ట్రపతి, గరవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు

చంద్రబాబు వల్లే స్టీల్ ప్లాంట్ జాప్యం
కడప స్టీల్ పాంట్ శంకుస్థాపన అంశంపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాని విమర్శించారు. కేంద్రం సాయం లేనిదే ..ఇంత పెద్ద ప్రాజెక్టు సాధ్యపడదు..అయినప్పటికి చంద్రబాబు రాయలసీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి స్టీట్ ప్లాంట్ కు సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని.. అందువల్లే ప్లాంట్ నిర్మాణం విషయంలో జాప్యం జరిగిందని కన్నా కేంద్ర ప్రభుత్వా తీరును సమర్ధించుకున్నారు. కేంద్రం నుంచి కడప స్టీల్ ప్లాంట్ సాధించుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలయ్యారని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

దమ్ముంటే.. వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఈ సందర్భగా చంద్రబాబు శ్వేత పత్రాల విడుదలపై కన్నా స్పందిస్తూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు శ్వేతపత్రం అంటే ఏంటో తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేశ చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే కేంద్రం విడుదల చేసిన నిధులు, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై శ్వేతపత్రం విడుదల చేయగలరూ అంటూ కన్నా సవాల్ విసిరారు. 

ప్రధాని పర్యటనను అడ్డుకుంటే ఖబర్దార్
కేంద్రం నుంచి నిధులు రాబట్టడంతో పూర్తిగా విఫలమైన చంద్రబాబు...కేంద్రం ఈ రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని ఆరోపించడం దారుణమన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వడం లేదని బీజేపీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. తన చేతగాని తనాన్ని చంద్రబాబు ఇలా బీజేపీపై నెడుతున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు.. కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చిందని.. భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తుందని కన్నా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రధాని పర్యటనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై కన్నా స్పందిస్తూ  దేశ ప్రధాని హోదాలో ఉన్న మోడీని రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటామని టీడీపీ నేతలు చెప్పడం దారుణమన్నారు. ఈ విషయంలో టీడీపీ వారిపై క్రిమినల్  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బీజేపీ చీఫ్ కన్నా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

Section: 
English Title: 
AP BJP Chief Kanna Laxminarayana fires on AP CM Chandrababu Policies
News Source: 
Home Title: 

చంద్రబాబు విధానాలపై బీజేపీ చీఫ్ కన్నాలక్ష్మీనారాయణ టార్గెట్ 

చంద్రబాబు విధానాలపై బీజేపీ చీఫ్ కన్నాలక్ష్మీనారాయణ టార్గెట్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
చంద్రబాబు విధానాలపై బీజేపీ చీఫ్ కన్నా టార్గెట్
Publish Later: 
No
Publish At: 
Saturday, December 29, 2018 - 18:05