India Vs Australia 3rd Test : ఓటమి అంచున కంగారులు; టీమిండియాలో సమరోత్సాహం

మెల్ బోర్న్ లో జరగుతున్న మూడో టెస్టులో ఆసీస్ జట్టు  ఓటమి అంచుక కొట్టమిట్టాడుతోంది. మరోవైపు విజయానికి దరి చేరిన టీమిండియాలో సమరోత్సాహం నెలకొంది. 

Last Updated : Dec 29, 2018, 02:12 PM IST
India Vs Australia 3rd Test :  ఓటమి అంచున కంగారులు; టీమిండియాలో సమరోత్సాహం

మెల్ బోర్న్ వేదికగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో 4వ రోజు  బౌలర్లే పై చేయిసాధించారు. ఈ రోజు ఏకంగా 13 వికెట్లు నేలకొరిగాయి. ఇక  టీం పెర్మ్ఫామెన్స్ విషయానికి వస్తే ఉత్కంఠంగా జరిగిన ఈ రోజు పోరులో టీమిండియానే పై చేయి సాధించింది. రెండో ఇన్నింగ్ లో 54 పరుగల ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. విజయంపై దృష్టి పెట్టిన కెప్టెన్ కోహ్లీ.. ఇన్నింగ్ ను మరోమారు డిక్లేర్ చేశాడు. అప్పటికే తొలి ఇన్నింగ్ లో 292 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన ఈ రోజు చేసిన పలుగులు కలుపుకొని మొత్తంగా 399 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది. 

తలవంచిన ఆసీస్ జట్టు

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ఏమాత్రం పోరాటపటిన కచబర్చలేకపోయింది. భారత బౌలర్ల ముందు మరోసారి తలవంచింది. ఫలితంగా ఈ రోజు మొత్తం 85 ఓవర్లు ఆడిన ఆసీస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ లో జడేజా 3 వికెట్లు తీయగా...బుమ్రా, షమీలు చెరో రెండు వికెట్లు తీసి ఆసీస్ పతానికి కారణమయ్యారు. ఆసీస్ తరఫున 44 పరుగులు చేసి షాన్ మార్ష టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఆసీస్ ఓటమి లాంఛనమే..

ఇదిలా ఉండగా ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది ..ఆసీస్ చేతిలో రెండే రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. విజయం కోసం 141 చేయాల్సిన స్థితిలో ఉంది. స్పెషలిస్టు బ్యాట్స్ మెన్లే తడబడుతున్న ఈ పిచ్ పై చివరి శ్రేణులో దిగిన వారు బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టం అసాధ్యమని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాబట్టి మూడో టెస్టులో ఆసీస్ ఓటమి అంచను నిలబడినట్లే. తాజా స్థితిపై టీమిండియాలో సమరోత్సాహం నెలకొంది
 

Trending News