Akshaya Tritiya 2024 Remedy: అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధులు పాటిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసా? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తృతీయను అక్షయతృతీయ అనే పేరుతో పిలుస్తారు. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దుర్ముహూర్తం చూసుకోకుండా ఈరోజు ఏ కొత్త పని ప్రారంభించిన కొత్త పని చేసిన నూరు శాతం విజయం తథ్యమని మన పురాణాల్లో చెప్పారు.
ఈ అక్షయ తృతీయ గొప్పతనం ఏంటంటే ఈ రోజు చేసే స్నానం దానం గాని పితృ దేవతలకు సంబంధించిన కార్యక్రమాలు గాని ఎటువంటి అనంతమైన ఫలితం లభిస్తుంది. ఈ రోజు పూజ చేస్తే కొన్ని వేల రెట్లు ఫలితం ఈ రోజు దానం ఇస్తే మామూలు రోజుల్లో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనం .ఈరోజు పితృదేవతలకు తర్పణం చేసిన పితృదేవతలకు దానం ఇచ్చిన మంచి ప్రయోజనాలు పొందుతారు.
అక్షయ తృతీయ సందర్భంగా నిండుకుండ దానం ఇవ్వండి. గోధుమలు, శనగలు పెరుగన్నం అక్షయ తృతీయ రోజు ప్రధానంగా ఇవ్వవలసిన దానాలు. నీటితో నిండిన కుండ, గోధుమలు, శనగలు, పెరుగన్నం ఈ నాలుగింటిలో ఏది ఇచ్చినా కూడా అనుగ్రహం కలుగుతుంది. దీనివల్ల మీకు ప్రత్యేకమైన లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కలుగుతాయి. ఏదైనా పుణ్య నదీజలాల్లో స్నానం చేసుకొని మీ ఇంట్లో ఈశాన్యం మూల ఏర్పాటు చేసుకుంటే దీని వల్ల ధన లక్ష్మి దేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.
ఇదీ చదవండి: అక్షయ తృతీయరోజు ఈ పనిచేశారో మీకు జీవితాంతం ఆర్థిక సంక్షోభమే..
ఈ రోజు ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 సార్లు చదువుకుంటే కుబేరుడు అనుగ్రహం కలుగుతుంది. అలాగే అక్షయ తృతీయ ఇంకో ప్రత్యేకత ఉంది అదేమిటంటే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజ రూపంలో దర్శనమిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు మీ ఇంట్లో లక్ష్మీ నరసింహ స్వామి చిత్రపటం ఉందా దానికి చందనంతో పూజ చేయాలి. లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహము లేదా చిత్రపటం ఏదైనా సరే ఖచ్చితంగా చందనం సమర్పించండి. బాధలు తొలగిపోతాయి. మీకు దగ్గరలో ఉన్న నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని నరసింహ స్వామి మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి 365 వత్తుల దీపం నరసింహ స్వామి ఆలయంలో పెట్టగలిగితే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
ఇదీ చదవండి: అక్షయతృతీయ రోజు ఈ ఒక్క పనిచేస్తే.. మీకు ఉన్న డబ్బు, ఆస్తి పదిరెట్లు అవ్వడం ఖాయం..
ఇంట్లో ఉన్న వాళ్ళయితే ఆవు పాలతో తేనెతో నరసింహ స్వామి విగ్రహానికి అభిషేకం చేస్తే కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. అక్షయ మైనటువంటి, అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter