Sage Leaves Benefits In Telugu: ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం వంటి వ్యాధులకు గురవుతున్నారు. అంతేకాకుండా అధిక రక్తంలో చక్కెర స్థాయి కళ్ళు, గుండె, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు 'సేజ్' ఆకులను సిఫార్సు చేస్తున్నారు.సేజ్ ఆకులు ముఖ్యంగా మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలలో వాడతారు. వీటికి ప్రత్యేకమైన సువాసన ఉండటం వల్ల వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. సాస్‌లు, స్టఫ్‌లు, సూప్‌లు, స్ట్యూస్‌లలో ఈ ఆకులను వేస్తారు.

ఈ సేజ్ ఆకులు శతాబ్దాలుగా ఔషధ తయారీలో ఉపయోగించబడుతున్నాయి. వీటిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. అయితే ఈ సేజ్ ఆకుల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. సేజ్‌ ఆకులు తీసుకోవడం వల్ల  అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు  శరీరంలో ఉండే వేడి, నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాకుండా డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది మంచి ఔషధం. కానీ మీరు మీ వైద్యుడిని సంప్రదించి దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆకును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి. మతిమరుపు , జ్ఞాపకశక్తి ఉన్నవారు కూడా ఈ ఆకులను తీసుకోవచ్చు. ఈ ఆకులు చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తాయి. సేజ్ ఆకులతో హెర్బల్ టీ తయారుచేసి తాగితే గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. సేజ్ ఆకుల సువాసన ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా సేజ్ ఆకులను నీటిలో నానబెట్టి, ముఖంపై ప్యాక్‌గా వేసుకోవచ్చు.

సేజ్ ఆకులను ఎలా ఉపయోగించాలి:

సేజ్ ఆకులను టీగా తాగవచ్చు.
వాటిని ఆహారంలో సుగంధ ద్రవ్యాల రూపంలో ఉపయోగించవచ్చు.
వాటిని నూనెగా తీసి చర్మంపై రాసుకోవచ్చు.

ఇంటి వాడకానికి:

ఎండిన సేజ్ ఆకులను బొగ్గులపై వేసి కాల్చి, వచ్చే పొగను ఇంట్లో నింపి శుభ్రమైన వాతావరణాన్ని పొందవచ్చు.సేజ్ ఆకులతో పాటు ఇతర సువాసన ద్రవ్యాలను కలిపి పొట్లీలు తయారుచేసి వాటిని బట్టల కప్పులో, అల్మారాల్లో ఉంచవచ్చు.

ఈ ఆరోగ్యకరమైన సేజ్ ఆకులను మీ ఆహారంలో చేర్చుకోండి వాటి అద్భుత ప్రయోజనాలను పొందండి

గమనిక: సేజ్ ఆకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు రావచ్చు. గర్భిణీలు, పాలిచ్చే మహిళలు, ఏదైనా వైద్య పరిస్థితి ఉన్నవారు సేజ్ ఆకులను వాడే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

English Title: 
Sage Leaves Have Amazing Medicinal Properties This Is Equal To Nectar Sd
News Source: 
Home Title: 

Sage Leaves Uses: అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన సేజ్ ఆకులు.. అమృతంతో సమానం!

Sage Leaves Uses: అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన సేజ్ ఆకులు.. అమృతంతో సమానం!
Caption: 
Zee Telugu News
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన సేజ్ ఆకులు.. అమృతంతో సమానం!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, April 26, 2024 - 18:21
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
63
Is Breaking News: 
No
Word Count: 
278

Trending News