/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Home Remedies For White Hair: ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నవయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల వైట్‌ హెయిర్‌ను తొలగించుకోవచ్చు. వైట్‌ హెయిర్‌ రావడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. మీలో పోషక ఆహారలోపం ఉండటం లేదా మీరు థైరాయిడ్ సమస్య ఉండటం వల్ల ఈ సమస్యలు కులుగుతాయి. 

తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ట్రిక్‌ ను మీరు ట్రై చేయండి. దీని కోసం మీరు ఉసిరి పొడి, నిమ్మరసం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిటిని కలిపి తలకు అప్లై చేయాల్సి ఉంటుంది. తరువాత తల స్నానం చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుండి. తెల్ల జుట్టుకు ఉల్లిగడ్డలు ఎంతో మేలు చేస్తాయి. 
దీనిని రసం తీసుకొని జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు.

కొబ్బరినూనెలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల హెయిర్ బ్లాక్‌గా మారుతుంది. రెగ్యులర్‌గా క్యారెట్‌ జూస్‌ తీసుకోవడం వల్ల మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నువ్వులను మెత్తని పేస్టుగా మార్చుకుని ఇందులోకి బాదం ఆయిల్‌ ను కలుపుకోవడం వల్ల హెయిర్‌ బ్లాక్‌గా మారుతుంది. వీటితో పాటు మీరు పోషకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు తినే ఆహారంలో ప్రొటీన్స్, విటమిన్‌ బీ12 ఎక్కువగా ఉండే వాటిని తినాలి.  గుడ్లు, పాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆకుకూరలను తప్పకుండా మీ డైట్‌ లో తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఆకుకూరలో ఉండే పోషకాలు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

ధూమపానం జుట్టు రాలడానికి ముందస్తు తెల్ల జుట్టుకు దోహదపడుతుంది. ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలడానికి ముందస్తు తెల్ల జుట్టుకు దోహదపడుతుంది. యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను అభ్యసించండి.
సూర్యరశ్మి జుట్టు దెబ్బతీస్తుంది. తెల్ల జుట్టుకు దోహదపడుతుంది. వెలుపలకు వెళ్లేటప్పుడు టోపీ లేదా స్కార్ఫ్ ధరించండి జుట్టు రక్షణ ఉత్పత్తిని ఉపయోగించండి. నల్ల మిరియాలలో పైపెరిన్ అనే పదార్థం ఉంటుంది, ఇది జుట్టు రంగు ఉత్పత్తిని పెంచుతుంది. 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలను 1 కప్పు నూనెలో రాత్రంతా నానబెట్టి, తర్వాత వడగట్టి జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత కడగండి. నల్లటి జుట్టు మీ సొంతం అవుతుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Suffering From Gray Hair Try These Tips For Better Results Sd
News Source: 
Home Title: 

White Hair: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ ట్రిక్‌ ట్రై చేయండి!
 

White Hair: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ ట్రిక్‌ ట్రై చేయండి!
Caption: 
Zee Telugu News
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ ట్రిక్‌ ట్రై చేయండి!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, April 21, 2024 - 15:09
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
12
Is Breaking News: 
No
Word Count: 
296