Theppa Samudram Movie Review: ఉత్కంఠ రేపే మలుపులతో 'తెప్ప సముద్రం' .. ఎలా ఉందంటే.. ?

Theppa Samudram Movie Review: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా కిషోరి దాత్రక్ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 18, 2024, 08:35 PM IST
Theppa Samudram Movie Review: ఉత్కంఠ రేపే మలుపులతో  'తెప్ప సముద్రం' ..  ఎలా ఉందంటే.. ?

రివ్యూ:  తెప్ప సముద్రం (Theppa Samudram)
నటీనటులు: అర్జున్ అంబటి, కిషోరి దాత్రక్,  రవి శంకర్,  చైతన్య రావు తదితరులు
సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లి
ఎడిటర్: సాయి బాబు తలారి
సంగీతం: పెద్దపల్లి రోహిత్ (పీ.ఆర్)
నిర్మాత: నిరుకంటి మంజుల రాఘవేందర్ గైడ్
దర్శకత్వం: సతీష్ రాపోలు
విడుదల తేది: 19-4-2024

‘బిగ్ బాస్’ ఫేం అర్జున్ అంబటి,  కిశోరి దాత్రక్ జోడిగా నటించి లేటెస్ట్ మూవీ 'తెప్ప సముద్రం'.  చైతన్య రావు, రవి శంకర్ ఇతర లీడ్ రోల్లో యాక్ట్ చేసారు.  సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు.  బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్  నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ సంగీతం అందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో లేదో మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
తెలంగాణలోని తెప్ప సముద్రం అనే ఊళ్లో వరుసగా చిన్న పిల్లలను కనిపించకుండా పోతుంటారు. వారి ఆచూకి కోసం తల్లితండ్రలు ఎంతో వేధన అనుభవిస్తూ ఉంటారు. ఆ ఊరికి చెందిన ఎస్.ఐ. గణేస్ (చైతన్యరావు) చిన్న పిల్లల మాయం ఎందుకు అవుతున్నారనే విషయమై ఇన్విష్టిగేషన్ చేస్తుంటాడు. మరోవైపు నేత్ర ఫౌండేషన్ వ్యవస్థాకురాలు ఇందు (కిశోరి ధాత్రిక్)కూడా తన ఫౌండేషన్‌లో ఉన్న చిన్నారులు కనిపించకుండా పోతారు. మరోవైపు ఇందును ప్రాణంగా ప్రేమించే విజయ్ (అర్జున్ అంబటి) కూడా కనిపించకుండా పోయిన పిల్లల కోసం వెతుకుంటారు. మరోవైపు ఎస్.ఐ. గణేష్ తండ్రి లాయర్ విశ్వనాథ్ (పి. రవిశంకర్) కూడా తన ట్యూషన్‌కు వచ్చే పిల్లలు తప్పిపోతారు. అతను కూడా తప్పిపోయిన పిల్లల కోసం వెతుకుతుంటారు.  ఎలా ఎవరికి వారు కనిపించకుండా పోయిన పిల్లల కోసం తమ వంతు ప్రయత్నాలు చేసే క్రమంలో అందరూ ఆశ్చర్యపోయే నిజం ఒకటి బయటకు వస్తుంది. అది ఏమిటి? తప్పి పోయిన చిన్న పిల్లలు ఏమయ్యారు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న ఆ కఠినమైన నిర్ణయం ఏమిటి? తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే.. తెప్ప సముద్రం మూవీ చూడాల్సిందే..

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెప్ప సముద్రం.. చిన్న పిల్లల కిడ్నాప్ చేయడం.. వారిపై అఘాత్యాయాలు, వారిని అవిటి వాళ్లను చేసి బిచ్చగాళ్లుగా మార్చడం వంటి ప్లాట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సతీష్ రాపోలు. ఇలాంటి కథలు తెలుగు సహా వివిధ భాషల్లో వచ్చినా.. ఇలాంటి స్టోరీలను గ్రిస్పింగ్‌గా చెబితే ప్రేక్షకులు ఆదిరిస్తారు. దర్శకుడు తాను ఎంచుకున్న కథను ఎక్కడా కన్ఫ్యూజన్‌గా లేకండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

అనగనగా ఓ ఊరు... ఆ ఊళ్లో ప్రపంచమే  తెలియని చిన్నారులపై దారుణంగా అత్యాచాలకు పాల్పడే సైకో... చివరకు అతనిని అంత మొదించడం... ఇలాంటి కథకు అనేక ట్విస్టులు ఇచ్చి... స్క్రీన్ ప్లేను చాలా ఆసక్తికరంగా నడిపించారు దర్శకుడు. చివరి వరకు అసలు హంతకుడు ఎవరనేది ప్రేక్షకులు ఓ పట్టాన కన్ ఫర్మేషన్ కు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాని చివరకంటా ఆసక్తికరంగా ప్రేక్షకులను కదలనీయకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. . ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. సెకండాఫ్ అంతా ట్విస్టులతో మూవీని భలే ఎంగేజ్ చేశారు దర్శకుడు సతీష్. తను అనుకున్న కథను యాజ్ టీజ్ గా తెరమీద చూపించారు. హాజీపూర్ సంఘటనలాంటి వాస్తవ సంఘటను కొంత బేస్ చేసుకొని ఈ సినిమాను ఆసక్తికర మలుపుతో తెరకెక్కించాడు.  . ఇందులోనే ఓ సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు డైరెక్టర్.

దర్శకుడు సతీష్ రాపోలు అనుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంది. వాస్తవ సంఘటనను బేస్ చేసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథనం ఆడియన్స్ ను మెప్పించేలా చేసాడు. ఆద్యంతం మలుపులతో ఆడియన్స్ ను థ్రిల్ గురిచేశారు. సినిమాటోగ్రఫ బాగుంది.  సంగీతం బాగుంది. పాటలు మాస్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

నటీనటుల విషయానికొస్తే..
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ఆటోడ్రైవర్  డ్రైవర్ విజయ్  పాత్రలో ఒదిగిపోయాడు. డాన్సలు విషయంలో మంచి ఈజ్ ఉంది. కథానాయికగా  కిశోరి దాత్రిక్ కూడా తన పరిధిమేరకు నటించింది.  బొమ్మాళి రవిశంకర్... లాయర్ విశ్వనాథ్ గా చాలా బరువైన పాత్రను పోషించి మెప్పించారు.  అతనికి భార్యగా నటించిన ఆమె కూడా బాగానే నటించారు. చైతన్య రావు నటన ఆకట్టుకుంది.  ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే  

ఇంటర్వెల్ బ్యాంగ్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

ఫస్టాఫ్

కొత్త నటీనటులు

లాస్ట్ పంచ్.. మలుపులతో మెప్పించే 'తెప్ప సముద్రం'..

రేటింగ్: 3/5

ఇదీ చదవండి:  తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News