Heat Waves Alert: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్తితులపై ఐఎండీ సూచనలు జారీ చేసింది. దక్షిణ విదర్బ నుంచి మారఠ్వాడా వరకూ ఉత్తర కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది. ఏప్రిల్ నెలలో ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 3-6 డిగ్రీలు అధికంగా ఉండటంతో ఆందోళన కలుగుతోంది. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి. అందుకే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ, రాయలసీమ మీదుగా వ్యాపించిన ద్రోణి కారణంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో ఉరుములు మెరుపులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఏపీలో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది.
ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అదే సమయంలో రానున్న మూడ్రోజులు తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి కన్పిస్తోంది. అటు వడగాల్పులు కూడా వీయనున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also read: Nomination Rules: నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook