Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
మన ఇళ్లలో లేదా పొలాలల్లో కరెంట్ రాకపోతే వెంటనే లైన్ మెన్ లకు సమాచారం ఇస్తాం. వెంటనే లైన్ మెన్ లు ఎక్కడైతే పవర్ సప్లై లేదో ఆ ప్రాంతానికి చేరుకుంటారు.ఆ తర్వాత అక్కడ వయర్ లు ఎక్కడైన కట్ అయ్యాయా.. అని చెక్ చేస్తారు.
కొన్నిసందర్బాలలో పోల్ మీద వయర్ లు జాయింట్ కావడం, ఓకే లైన్ కు కరెంట్ సప్లై అవ్వడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. మెయిన్ గా లైన్ మెన్ లు విద్యుత్ స్థంబాలు ఎక్కెటేప్పుడు , ట్రాన్స్ ఫార్మర్ కు వెళ్లి విద్యుత్ సప్లైను నిలిపివేస్తుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం అనుకోకుండా పవర్ సప్లై జరుగుతుంది.
ఇలాంటి సందర్బాలో పోల్ మీద ఉన్న వ్యక్తి షాక్ కు గురై అక్కడే చనిపోవడం కూడా జరుగుతుంది. మరికొన్ని సందర్బాలలో విద్యుత్ సిబ్బంది నెగ్లిజన్సీ వల్ల వయర్ లు ఇంటి బంగ్లాకు దగ్గరలో ఉండేలా పోల్ ఏర్పాటు చేయడం, వయర్ తెగిపోయిన కూడా పట్టించుకోక పోవడం చేస్తుంటారు.
ఇది తెలియక రోడ్డుమీద వెళ్తున్న వారు అనుకోకుండా ఆవయర్ ను ముట్టుకుంటే వెంటనే షాక్ తగిలి మరణిస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. విద్యుత్ విషయంలో అదందరు ఎల్లప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి.
అయితే.. విద్యుత్ షాక్ కు గురై మరణించిన వారికి ఇక మీదట తెలంగాణ విద్యుత్ శాఖ రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిహారం అనేది విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు మాత్రమే ఈ పరిహారం ఇస్తారు
కావాలని విద్యుత్ వయర్లను మట్టుకుని సూసైడ్ చేసుకున్న వారికి ఎలాంటి పరిహారం ఇవ్వరని విద్యుత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఒక వేళ ఎవరైన మరణిస్తే, ఎఫైఐఆర్, డెత్ సర్టిఫికేట్, దాని సంబంధిత పత్రాలు ఏఈ, డీఈ లకు సమర్పించాలి
వీరి విచారణ తర్వాత ఇచ్చిన సమాచారం మేరకు విద్యుత్ అన్నతాధికారులు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తారని సమాచారం. ముఖ్యంగా విద్యుత్ శాఖాపరమైన తప్పిదాల వల్ల చనిపోయిన వారికి మాత్రమే ఈ నష్ట పరిహారం అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.