IPL 2024, KKR vs DC Live Score: వైజాగ్ స్టేడియం ఫోర్లు, సిక్సర్లతో దద్దరిల్లిపోయింది. కేకేఆర్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. సునీల్ నరైన్, రఘవంశీ, రస్సెల్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో పంత్ సేనకు బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి. దీంతో అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
నరైన్ విశ్వరూపం..
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా సునీల్ నరైన్ ఢిల్లీ బౌలర్లను వీరబాదుడు బాదాడు. మరోవైపు ఫిల్ సాల్ట్ కూడా బ్యాట్ ఝలిపించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించిన తర్వాత సాల్ట్ ఔటయ్యాడు. మరోవైపు నరైన్ కు జతకలిసిన ఆంగ్రిష్ రఘవంశీ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. క్రీజులో ఉన్నంతసేపు వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించారు. ఈ క్రమంలో నరైన్, రఘవంశీ హాఫ్ సెంచరీలు పూర్తి చేస్తుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని నోర్టేజ్ విడదీశాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 పరుగులు చేసిన రఘవంశీని ఔట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ ఆనందం ఎంతసేపు నిలవలేదు.
రస్సెల్, రింకూ మెరుపులు..
మరోవైపు నరైన్ వేసిన బాల్ వేసినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. సునీల్ కు జతకలిసిన రస్సెల్ కూడా బ్యాట్ ఝలిపించాడు. అయితే సెంచరీకి కొద్ది దూరంలో నరైన్ ఔటయ్యాడు. కేవలం 39 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. వచ్చి రాగానే రెండు సిక్సర్లు కొట్టిన అయ్యర్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన రింకూసింగ్ రస్సెల్ తో కలిసి స్కోరు బోర్డును 250 పరుగులు ధాటించాడు. రింకూ సింగ్ కేవలం 8 బంతుల్లోనే ఫోర్, మూడు సిక్సర్లతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. రస్సెల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లో 41 పరుగులు చేశాడు.
Also Read: IPL 2024: మాంచి ఊపు మీదున్న రాహుల్ సేనకు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ ఔట్.. కారణం ఇదే..!
Also Read: Ishan Kishan: సూపర్ మ్యాన్ గెటప్ లో ఇషాన్ కిషన్.. కారణం తెలిస్తే నవ్వు రాక మానదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి