Zee Drama Juniors: ప్రతిభ గల వారిని ప్రోత్సహించి ఎంతో మందిని బుల్లితెర, వెండితెరపై మెరిసేలా చేసిన 'జీ తెలుగు' మరో ప్రత్యేక కార్యక్రమంతో ముందుకువచ్చింది. మీ పిల్లల్లో నటనపై ఆసక్తి ఉంటే వారికి అద్భుత అవకాశం 'జీ' కల్పిస్తోంది. ప్రతిభ ఉంటే చాలు మీ పిల్లలను తెరపై చూసుకోవచ్చు. ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న 'డ్రామా జూనియర్స్' మరో సీజన్ వచ్చేస్తోంది. ఈ షో కోసం ప్రతిభ గల చిన్నారులను అన్వేషిస్తున్నారు. ఆడిషన్స్‌కు వచ్చేయండి.
Also Read: Jr NTR New Car: కొత్త కారు కొన్న 'దేవర'.. జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు ధర, మోడల్ ఏమిటో తెలుసా?
ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందుండే 'జీ తెలుగు' మరోసారి విజయవంతమైన 'షో డ్రామా జూనియర్స్' సరికొత్త సీజన్‌తో మీ ముందుకు వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారుల్లో నటనా ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ప్రారంభించనుంది. ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్‌లను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్ మరో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Also Read: Nikhil Siddhartha Twist: హీరో నిఖిల్ సిద్ధార్థ్ బిగ్ ట్విస్ట్.. టీడీపీలో చేరలేదంటూ ప్రకటన
ప్రతిభగల చిన్నారులను ఆడిషన్స్‌కు ఆహ్వానిస్తోంది. డ్రామా జూనియర్స్ సీజన్ 7 కోసం తెలుగు రాష్ట్రాల్లో నటనపై ఆసక్తిగల చిన్నారులకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. 3 నుంచి 13 సంవత్సరాల వయసు గల పిల్లలు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది చక్కటి అవకాశం. మీ పిల్లలకు నటనపై ఆసక్తి ఉంటే ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బాటలు వేయండి. 'జీ తెలుగు డ్రామా జూనియర్స్‌తోపాటు చక్కగా పాటలు పాడి అలరించే పిల్లలకోసం ఆడిషన్స్ నిర్వహించనుంది.
నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, మార్షల్ ఆర్ట్స్, మ్యాజిక్‌లో ప్రవేశం ఉన్న పిల్లలకూ అద్భుత అవకాశం 'జీ తెలుగు' అందిస్తోంది. ఈ ఆడిషన్స్ ఆదివారం (ఏప్రిల్ 07న) శ్రీ సారథి స్టూడియోస్, అమీర్‌పేట, హైదరాబాద్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఆడిషన్ కొనసాగనుంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మీ చిన్నారులను ఏవైనా సందేహాలు ఉంటే 91000 54301 నంబర్‌లో సంప్రదించవచ్చు.
ఆడిషన్ వివరాలు
షో: డ్రామా జూనియర్స్
వయసు: 3 నుంచి 13 ఏళ్లలోపు చిన్నారులు
తేదీ: 7 ఏప్రిల్ 2024.
ఎక్కడ: సారథి స్టూడియోస్, అమీర్‌పేట, హైదరాబాద్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook