MLA Sanjay Kumar: తెలంగాణ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం.. బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి

Jagtial MLA Dr Sanjay Kumar Father Died: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. విషయం తెలుసుకున్న గులాబీ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 29, 2024, 06:48 PM IST
MLA Sanjay Kumar: తెలంగాణ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం.. బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి

MLA Dr Sanjay Kumar: రాజకీయంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికలకు పూర్తి సంసిద్ధం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాద సంఘటన జరిగింది. అతడి తండ్రి మృతి చెందడంతో ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తండ్రి మరణించాడు. ఈ వార్త తెలుసుకున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. అజయ్‌ కుమార్‌ను ఓదార్చి సముదాయించారు.

Also Read: Kadiyam Kavya: లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని పరిణామం.. కడియం కావ్య సంచలన నిర్ణయం

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి హనుమంత రావు (85) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయన ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఎన్నో కేసులు వాదించి కరీంనగర్‌ జిల్లాలో న్యాయవాదిగా రాణించారు. ఆయన మృతి తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంజయ్‌ ఇంటికి తరలివచ్చారు. హనుమంత రావు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Also Read: KK KCR Meet: 'కేసీఆర్‌ అన్న వెళ్లొస్తా'.. బీఆర్‌ఎస్‌ను వీడేందుకు కే కేశవరావు, గద్వాల్‌ విజయలక్ష్మి సిద్ధం

అనంతరం అంతిమయాత్ర నిర్వహించగా పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. రాత్రి నారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ వార్త తెలుసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కేటీఆర్ పరామర్శించేందుకు జగిత్యాల రానున్నట్లు గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News