Bengaluru Techie Attend Zoom Meeting While Driving: ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవితం అయిపోయింది. కడుపు నిండా తినడానికి, మన పనులు మనం చేసుకొవడానికి కూడా సమయంలేనంతగా బిజిగా ఉంటున్నారు. ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు ఉంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొద్దున లేచినప్పటి నుంచి ఆ హాడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంట్లో ఇద్దరు భార్యభర్తలు ఉద్యోగస్థులైతే.. ఇక గొడవలు కూడా జరుగుతుంటాయి. నువ్వు ఆపని చేయి.. నేను ఈ పనిచేస్తానంటూ కూడా గొడవలకు దిగుతుంటారు. అంతేకాకుండా మరికొందరు ఇక ఆఫీసుటైమ్ అయ్యే వరకు బిందాస్ గా పడుకుని ఉండి, తీరా టైమ్ కు అందర్ని పరిగెత్తిస్తుంటారు.వీరి బద్దకం ప్రవర్తన వల్ల అందరు ఇబ్బందులు పడుతుంటారు.ట్రాఫిక్ సమస్యల వల్ల కొన్నిసార్లు ఆఫీసులకు వెళ్లడం ఆలస్యమౌతుంది.
Bengaluru is not for beginners 😂
(🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW
— Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024
ఇక.. కొందరు కారులో ఆఫీసు బట్టలు వేసుకొవడం,టిఫిన్ లు తయారు చేసుకొవడం వంటి ఎన్నో వీడియోలను మనం సోషల్ మీడియాలోచూశాం. తాజాగా, ఒక టెకీ.. టూవీలర్ మీద వెళ్తునే తన కాళ్లమీద ల్యాప్ టాప్ పెట్టుకుని మరీ జూమ్ మీటింగ్ కు అటెండ్ అయ్యాడు.ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
పూర్తివివరాలు..
కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. బెంగళూరులోని స్వాగత్ ఓనిక్స్ థియేటర్లో రోడ్డులో ఒక వ్యక్తి స్కూటీపై రైడింగ్ చేస్తే జూమ్ మీడింగ్ కు అటెండ్ అయ్యాడు. అతగాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, తన కాళ్లమీద ల్యాప్ టాప్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు. ల్యాప్ టాప్ ఆన్ లోనే పెట్టుకుని జూమ్ మీటింగ్ కు కూడా అటెండ్ అయ్యాడు.
Read More: Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వైరల్ గా మారిన వీడియో..
అటు రోడ్డుమీద ట్రాఫిక్ ను చూస్తూ.. మధ్య మధ్యలో ల్యాప్ టాప్ ను చూస్తు, డ్రైవింగ్ చేస్తున్నారు. వెనుకాల నుంచి వెళ్తున్న కొందరు దీన్ని వీడియో రికార్డు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నువ్వు గ్రేట్ భయ్యా.. అంటూకొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు జాగ్రత్త గురూ.. ల్యాప్ టాప్ పడిపోతే.. తుక్కైపోతుందంటూ కూడా అలర్ట్ చేస్తున్నారు. మరీ అంత బిజీగా ఉంటే ముందే ప్లాన్ లు చేసుకొవచ్చు కదా.. అంటూ ఇంకొందరు అడ్వైజ్ ఇస్తున్నారు. ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook