Lambasingi Movie Review and Rating: బిగ్ బాస్ బ్యూటీ దివి ప్రధాన పాత్రలో భరత్ రాజు హీరోగా తెరకెక్కిన మూవీ లంబసింగి. నవీన్ గాంధీ దర్శకత్వం వహించగా.. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు వంటి హిట్ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆనంద్ తన్నీరు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ట్రైలర్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ఈ మూవీ నేడు (మార్చి 15) థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథ ఏంటంటే..?
వీరబాబు (భరత్ రాజ్) అనే యువకుడు కానిస్టేబుల్‌గా ఎంపికవుతాడు. అతనికి లంబసింగి అనే గ్రామంలో పోస్టింగ్ వస్తుంది. కానిస్టేబుల్‌గా ఆ ఊరికి వెళ్లిన వీరబాబు.. బస్సు దిగగానే హరిత (దివి)ని చూసి లవ్‌లో పడిపోతాడు. ఆమె మాజీ నక్సలైట్ కూతురు అని తెలుసుకుంటాడు. గతంలో నక్సలైట్లుగా పనిచేసిన వారికి ఆ గ్రామంలో ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. మాజీ నక్సలైట్లతో పోలీసులు రోజు సంతకాలు తీసుకుని.. వాళ్లను గమనిస్తూ ఉండాలి. ఈ పనిని వీరబాబుకు అప్పగిస్తారు. హరితను ప్రేమలో పడేసేందుకు రోజు ఆమె తండ్రితో సంతకం కోసం వాళ్ల ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరిత అదే గ్రామంలో నర్సుగా పనిచేస్తుంటుంది. ఓ వ్యక్తిని కాపాడే సమయంలో హరితతో వీరబాబుకు మరింత పరిచయం పెరుగుతుంది. ఓ మంచి రోజు చూసుకుని తన మనసులోని మాటను హరితకు చెబుతాడు. వీరబాబు ప్రేమను హరిత రిజెక్ట్ చేస్తుంది. దీంతో నిరాశ ఉన్న వీరబాబుకు ఓ రోజు స్టేషన్లో ఒక్కడే డ్యూటీ చేయాల్సి వస్తుంది. అదేరోజు కొందరు నక్సలైట్లు స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలను ఎత్తుకెళతారు. నక్సలైట్ల దాడిలో గాయపడిన వీరబాబుకు ఊహించని షాక్ తగులుతుంది. హరిత వీరబాబు ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది..? ఆమె గతం ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే లంబసింగి మూవీ చూడాల్సిందే.
ఎవరు ఎలా నటించారు..?
ఇప్పటివరకు దివిని దర్శకులు ఎక్కువగా గ్లామర్ కోసమే వాడుకున్నారు. అయితే ఈ మూవీలో ఆమె సహజమైన నటి ఉందని ఆడియన్స్‌కు తెలిసింది. హరిత అనే పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఆమెలోని నటిని డైరెక్టర్ నవీన్ గాంధీ చక్కగా వాడుకున్నారు. కానిస్టేబుల్ వీరబాబు పాత్రలో హీరో భరత్ మెప్పించాడు. క్లైమాక్స్‌లో ఎమోషన్సల్ పర్ఫామెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. కామెడీ టైమింగ్ కూడా సరిగ్గా సెట్ అయింది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ప్రేక్షకులను అలరించారు.
విశ్లేషణ
దర్శకుడు నవీన్ గాంధీ చాలా మంచి పాయింట్ తీసుకుని లంబసింగిని తెరకెక్కించారు. ప్రథమార్ధంలో కొంచెం స్లోగా సాగినా.. తరువాత కథలో వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ పాత్రను నవీన్ గాంధీ చక్కగా డిజైన్ చేశారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురవుతారు. ద్వితీయార్ధం ఆరంభం నుంచే కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వండా స్క్రీన్ ప్లేను చక్కగా రాసుకున్నారు డైరెక్టర్. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ వర్కవుట్ అయింది. క్లైమాక్స్‌ను ఎమోషనల్‌గా నడిపించారు. అదే ఫీల్‌ను క్యారీ చేస్తూ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. 2 గంటల 2 నిమిషాల పాటు లంబసింగి ప్రపంచంలోకి తీసుకువెళ్లారు. ఆర్ఆర్ ధృవన్ అందించిన మ్యూజిక్ ప్లస్ అయింది. ప్రతిపాట మనసుకు హత్తుకునేలా ఉంటాయి. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. కె.బుజ్జి ప్రెజెంటేషన్, ఎడిటర్ వర్ధన్ కావూరి పనితనం తెరపై కనిపిస్తుంది. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా.
రేటింగ్: 3/5
Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter