Lok Sabha Polls: రెండు, మూడు రోజుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పార్టీ కొత్త వ్యూహం రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠంతో లోక్‌సభ ఎన్నికలకు అత్యంత జాగ్రత్తతో ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటనలో కూడా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఆశ్చర్యపరిచాయి. తాజాగా మరో రెండు స్థానాలకు ఎవరూ ఊహించని వ్యక్తులను గులాబీ దళపతి కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించారు.
Also Read: BRS Party: బీఆర్‌ఎస్ పార్టీ సంచలనం.. వారిని కాదని వీరికి నాలుగు టికెట్లు కేటాయింపు మరి గెలుస్తారా?
దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మేడ్చల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో గురువారం ఈ రెండు లోక్‌సభ సెగ్మెంట్లకు సంబంధించిన ముఖ్య నాయకులతో కేసీఆర్ చర్చలు జరిపారు. అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అందరి అభిప్రాయం మేరకు వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మొత్తం 17 స్థానాల్లో 11 లోక్‌సభ నియోజకవర్గాలకు గులాబీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు స్థానాలు బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన నాలుగు స్థానాలపై కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: Kavitha: పుట్టినరోజు నాడే కూతురు కవితకు కేసీఆర్ భారీ షాక్..
పూర్తి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక
అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో అనూహ్య మార్పులు జరిగాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పాఠం నేర్చుకున్న గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక మరింత విస్మయానికి గురి చేస్తోంది. ఆశావహులను పక్కనపెట్టి అసలు ఎవరూ ఊహించని వ్యక్తులను కేసీఆర్ ఎంపిక చేస్తున్నారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ మినహా మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక రాజకీయ వర్గాలకు కూడా అంతుచిక్కలేదు. ముఖ్యంగా నిజామాబాద్, ఇప్పుడు మల్కాజిగిరి స్థానాలు ఆశ్చర్యపరిచాయి. ప్రయోగాలకు పెట్టింది పేరైనా కేసీఆర్ ఆయన వేసిన వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది వేచిచూడాలి.
బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన 11 మంది అభ్యర్థుల జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
MP Candidates: అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం.. మరో రెండు లోక్‌సభ స్థానాలకు కొత్త వ్యక్తులు