Tuberculosis Tips: ట్యూబర్‌క్యులోసిస్ కూడా ఓ సీరియస్ సమస్య. ప్రతి యేటా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సమయానికి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతోంది. ట్యూబర్‌క్యులోసిస్ లేదా టీబీ అనేది శరీరంపై అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. టీబీ అనేది ఓ అంటువ్యాధి ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. అందుకే టీబీ రోగులు ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ట్యూబర్‌క్యులోసిస్ అనేది ప్రధానంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడుతుంది. అరుదైన కేసుల్లో బ్రెయిన్, యుటెరస్, నోరు, గొంతు, లివర్, కిడ్నీలకు కూడా టీబీ సోకవచ్చు. ఊపిరితిత్తులకు సోకే టీబీ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులు తుమ్మడం లేదా దగ్గడం చేస్తున్నప్పుడు నోరు లేదా ముక్కు నుంచి వెలువడే డ్రాప్స్ ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అందుకే టీబీ వ్యాధిగ్రస్థులు ఉమ్మేటప్పుడు ప్లాస్టిక్ సంచి వినియోగించి చివర్లో శుభ్రం చేసి డస్ట్ బిన్‌లో పడేయాలి.
టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి
ఈ వ్యాధి అన్నింటికంటే ఎక్కువగా ఊపిరితిత్తులకే సోకుతుంటుంది. ఫలితంగా తీవ్రమైన దగ్గు ఉంటుంది. ముఖ్యంగా డ్రై కాఫ్ ఉంటుంది. కఫం, రక్తం కూడా కారవచ్చు. దగ్గు 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించాలి.
చెమట పట్టడం టీబీ ప్రధాన లక్షణం. రాత్రి నిద్రపోయేటప్పుడు లేదా ఎప్పుడైనా చెమట్లు పడుతుంటే ఈ వ్యాధి లక్షణం కావచ్చు. ఈ వ్యాదిగ్రస్థులకు తరచూ జ్వరం వస్తుంటుంది. మొదట్లో తేలికపాటి జ్వరం ఉన్నా తరువాత శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంటుంది.
టీబీ వ్యాధిగ్రస్థులకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రోగాలతో పోరాడే సామర్ధ్యం ఉండదు. దాంతో అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయి. టీబీ రోగులకు బరువు క్రమంగా తగ్గుతుంటుంది. తిండి రుచిగా అన్పించదు. టీబీ రోగులకు శ్వాస సంబంధిత సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతో అదే పనిగా దగ్గు వస్తుంటుంది. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది రావచ్చు.
టీబీ నుంచి ఎలా రక్షించుకోవచ్చు
చిన్నపిల్లలకు ఇచ్చే బీసీజీ టీకా టీబీ నుంచి రక్షించేందుకే ఇస్తారు. దగ్గు తుమ్ముల తరువాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. రోగుల్ని గాలి వెలుతురు ధారాళంగా ప్రవహించే గదుల్లో ఉంచాలి. మాస్క్ ధరించాలి. నోటిని పేపర్ నాప్కిన్‌తో కవర్ చేస్తుండాలి. బీడీ, సిగరెట్, హుక్కా, తంబాకూ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. 1-2 వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు వెంటాడుతుంటే వైద్యుడిని సంప్రదించాలి. రోజూ వ్యాయామం, యోగా అలవర్చుకోవాలి.
Also read: Thyroid Diet: ఈ 5 హెల్తీ ఫుడ్స్ థైరాయిడ్ రోగులకు శాపంగా మారతాయా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook