Maha Shivaratri - tollywood heroes as bhagawan shiva: మహా శివుడు విలక్షణ దేవుడు.. భక్త సులభుడు.. అడిగిందే తడువుగా కోరిన వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయన్ని భోళా శంకరుడు అంటారు. చూసే మనసుండాలి కానీ జగమంతా శివమయమే. ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి.. బిల్వ పత్రాలతో పూజా చేస్తే పరవశించే దేవ దేవుడు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజున శివరాత్రి జరుపుకోవడం సనాతన సాంప్రదాయంగా వస్తోంది. కానీ మహా శివుడికి ఈ రాత్రి మహా రాత్రి. ఈ రాత్రి శివయ్య కోసమే. అందుకే ఈ రాత్రిని మహా శివరాత్రి అంటారు. ఎంతో మంది డైరెక్టర్స్ వెండితెరపై శివలీలను ఆవిష్కరించారు. ఆ మహాదేవడి సంబంధించి తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. మన అగ్ర హీరోలు చాలా మంది ఆ మహా శివుడి వేషంలో అలరించారు. అలా తెలుగు తెరపై మహాదేవుడిగా మెప్పించిన హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
రెబల్ స్టార్ ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాలో ప్రభు శ్రీరాముడి పాత్రలో అలరించారు. ఇపుడు మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తోన్న 'కన్నప్ప'లో మహా దేవుడి పాత్రలో అలరించనున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ తరంలో హరిహరలుగా అలరించిన హీరోగా రికార్డులకు ఎక్కారు ప్రభాస్.
అన్న ఎన్టీఆర్ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది రాముడు, కృష్ణుడి వేషాలే. కానీ ఈయన సుదీర్ఘ కెరీర్లో దక్ష యజ్జం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ సినిమాల్లో మహా శివుడిగా మెప్పించారు.
నటభూషణ శోభన్ బాబు.. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'పరమానందయ్య శిష్యుల కథ' సినిమాలో శివయ్య వేషంలో కనిపించడం విశేషం.
రెబల్ స్టార్ కృష్ణంరాజు వినాయక విజయం సినిమాలో మహా దేవుడి వేషంలో కనిపించారు. వినాయక చవితి ఎపుడు వచ్చినా.. ప్రముఖ శాటిలైట్ ఛానెల్స్‌లో ఈ సినిమా ప్రసారం అవుతూనే ఉంటుంది. ఇందులో శివలీలను కూడా చూపించడం విశేషం.
ఒకప్పటి తెలుగు హీరో రామకృష్ణ కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన 'మాయా మశ్చీంద్ర' సినిమాలో గోరఖ్ నాథ్ పాత్రలో మెప్పించారు.
మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో పౌరాణిక పాత్రలో నటించిన ఏకైక చిత్రం 'శ్రీమంజునాథ'. ఈ సినిమాలో చిరంజీవి.. టైటిల్ రోల్ శ్రీమంజునాథుడి మెప్పించారు. అంతకు ముందు పార్వతీ పరమేశ్వరులు, ఆపద్భందవుడు సినిమాల్లో వచ్చే సన్నివేశాల్లో పరమేశ్వరుడి పాత్రలో మెప్పించడం విశేషం.
జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామ కళ్యాణం' సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా అనే పాటలో బాలయ్య కాసేపు మహా శివుడి పాత్రలో కనిపించి అభిమానులు అలరించారు.
అక్కినేని నాగార్జున కూడా జే.కే.భారవి దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీ ఆదిశంకరాచార్య' మూవీలో చండాలుడి వేషంలో కనిపించి ఆదిశంకర చార్యులకు తత్త్వం భోదించే పాత్రలో కనిపిస్తారు.
వీళ్లతో పాటు అక్కినేని నాగేశ్వరరావు 'మూగ మనసులు'లో ఓ పాటలో శివుడి పాత్రలో కనిపిస్తారు. అటు శ్రీ సత్యనారాయణ మహాత్యంలో సుమన్.. ఏకలవ్య చిత్రంలో రంగనాథ్.. ఏకలవ్య చిత్రంలో బాలయ్య.. మా ఊర్లో మహాశివుడు సినిమాలో రావుగోపాల రావు.. నాగుల చవితి, ఉమా సుందరి సినిమాల్లో నాగభూషణం.. ఉషా పరిణయంలో రాజనాల.. మధుర మీనాక్షి సినిమాలో విజయకాంత్.. మగరాయుడు సినిమాలో మల్లిఖార్జున రావు.. ఢమరుకంలో ప్రకాష్ రాజ్ వంటి నటులు మహా శివుడి పాత్రలో నటించడం విశేషం.