Whatsapp Scam Calls: వాట్సప్ స్కామ్ కాల్స్ నుంచి ఎలా బయటపడాలి

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు , స్కామర్లు కూడా వాట్సప్ వదలడం లేదు. ప్రజల్ని ఇరికించేందుకు వాట్సప్ కాల్స్ వినియోగిస్తున్నారు. 

Whatsapp Scam Calls: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు , స్కామర్లు కూడా వాట్సప్ వదలడం లేదు. ప్రజల్ని ఇరికించేందుకు వాట్సప్ కాల్స్ వినియోగిస్తున్నారు. 

1 /5

వాట్సప్ కాల్ చేసేటప్పుడు లింక్ పంపించి క్లిక్ చేయమని కోరితే అస్సలు స్పందించవద్దు. లేదా మాల్‌వేర్ డౌన్‌లోడ్ చేయమని అడిగినా రెస్పాండ్ కావద్దు.

2 /5

ఎవరైనా తెలియని వ్యక్తి వాట్సప్ కాల్ చేస్తే ఆ వాయిస్ క్వాలిటీ పసిగట్టాలి. ఎందుకంటే నేరగాళ్లయితేనే గొంతు మార్చుతుంటారు. గొంతు మెషీన్ వాయిస్‌లా ఉండవచ్చు. 

3 /5

ఎవరైనా వాట్సప్ కాల్ చేస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నేరగాళ్లు మిమ్మల్ని తొందరపెట్టి నిస్సహాయుల్ని చేస్తుంటారు. మీ బ్యాంక్ ఎక్కౌంట్ ప్రమాదంలో ఉందని తప్పులు చేయించేందుకు ప్రయత్నిస్తారు. వాటికి స్పందించవద్దు.

4 /5

ఎప్పుడైనా మీకు ఎవరైనా తెలియని నెంబర్ నుంచి వాట్సప్‌కు ఫోన్ వచ్చి వ్యక్తిగత విషయాలు, బ్యాంక్ వివరాల గురించి ఆరా తీస్తే అప్రమత్తమవాలి. అసలు అలాంటి కాల్స్ రిసీవ్ చేసుకోకూడదు.

5 /5

వాట్సప్‌కు ఏదైనా తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల మోసాలు జరగవచ్చు.