Ind vs Eng 5th Test: హిమాచల్ ప్రదేశ్‌లో ని దర్మశాల వేదికగా జరగనున్న చివరి టెస్ట్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. ఇవాళ జరగనున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బూమ్రా అందుబాటులోకి వచ్చేశాడు. ఇక బ్యాటింగ్ పరంగా అందరి దృష్టీ యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్‌పై ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దూకుడుపై ఉండటంతో స్పిన్ పటిష్టంగా మారిందని చెప్పవచ్చు. ఇక పేస్ విషయంలో మొహమ్మద్ సిరాజ్ బూమ్రా ఉంటారు. మూడో పేసర్‌గా ఆకాశ్ దీప్ లేదా కుల్దీప్ యాదవ్‌లో ఎవరో ఒకరికి అవకాశం లభిస్తుంది.
ఇక ఇంగ్లండ్ జట్టులో కూడా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ చేరనున్నాడు. చివరి టెస్ట్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ తరపున ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు అందుబాటులో ఉండవచ్చు. స్పిన్నర్లుగా టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ ఎంపికయ్యారు.
ధర్మశాలలో ఇప్పటి వరకూ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ 2017లో ఆస్ట్రేలియాతో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ధర్మశాల శీతల వాతావరణం కలిగి ఉండటం వల్ల సీమర్లకు అనుకూలం కావచ్చు. కానీ ఆ తరవాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారనుంది. మ్యాచ్ చివరి రోజు లేదా నాలుగో రోజు వర్షం పడే సూచనలున్నాయి.
టీమ్ ఇండియా
రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
ఇంగ్లండ్ తుది జట్టు
బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్
Also read: Hyundai Creta N Line Pics: లాంచ్ కంటే ముందే లీకైన Hyundai Creta N Line ఫోటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook