Mahashivaratri 2024 Remedy: హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరో నమ్మకం ప్రకారం ఈరోజు పాలసముద్రం నుంచి హాలాహలం బయటకు వస్తే లోకకల్యాణం కోసం శివుడి ఆ విషాన్ని సేవిస్తాడు. ఆరోజు నుంచి గుర్తుగా మహాశివరాత్రిని వేడుకగా జరుపుకొంటారు. శివుడికి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ఫాల్గున మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్ధశి తిథి రోజు జరుపుకుంటారు.
ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయడం వల్ల మనస్సు ఆహారానికి నీటికి దూరంగా ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుంటారు. పూజగదిలో దీపం పెట్టి శివయ్యను పూజిస్తారు. అంతేకాదు దగ్గర్లో ఉన్న శైవాలయాలకు వెళ్లి జలాభిషేకం చేసి పంచామృతాన్ని శివయ్యకు సమర్పిస్తారు. పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఉంటుంది. ఈ ఐదింటిని కలిపి అభిషేకం చేస్తారు.
అయితే, జోతిష్యశాస్త్రంలో శనిగ్రహం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. శనివక్రదృష్టి బాధలు, సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే శని కర్మలను ఇస్తాడు. మనం చేసిన పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు అని నమ్ముతాం. శనిదశ నుంచి విముక్తి కలగాలంటే మహాశివరాత్రి రోజు శివయ్యను ఇలా పూజించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: వాస్తు ప్రకారం చీపురు ఈ దిశలో పెట్టారంటే అష్టదరిద్రం తప్పదు..
ఈ ఏడాది మార్చి 8 శుక్రవారం రోజు మహాశివరాత్రి రానుంది. ఈరోజు శివునికి పాలాభిషేకం చేయాలి. శివుడికి ప్రదోషకాలంలో చేసే పూజ అత్యంత విశిష్టమైంది. ఆ తర్వాత శివపురాణం పఠించాలి. అంతేకాదు శివుడికి ఇష్టమైన పూలను కూడా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం జాతకంలో తగ్గిపోతుంది. ఆంజనేయ స్వామిని పూజించినా శనిదోషం పోతుంది. ముఖ్యంగా శనివారం రోజు వడమాల ఆంజనేయుడికి సమర్పించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
ముఖ్యంగా మహాశివరాత్రి రోజున మీ దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి శివచాలీసా పఠించండి. ఈరోజు అత్యంత విశేషమైన రోజు శనివారం రోజు సుందర కాండ పారాయణం చేసినా శనిదోషాలు తొలగిపోతాయి. మూగజీవాలకు ఆహారం వేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. పేదలకు దానం చేయడం కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శనివక్రదృష్టి తొలగిపోతుంది.
ఇదీ చదవండి: తులసిమొక్క వద్ద పొరపాటున కూడా ఈ 5 పెట్టకండి.. ఆ ఇంట ఎప్పుడూ ఆర్థికసమస్యలేనట..
శివ మంత్రాలు..
ఓం నమః శివాయ
ఓం త్రయంభకం యజామహే సుగంధిం పుష్టి
వర్ధనం ఉర్వరుక్మివ్ బంధనం మృత్యయోర్ ముక్షియ మామృతాత్ అనే మంత్రాలను పఠిస్తూ ఉండాలి. అంతేకాదు మహాశివరాత్రి రోజు వీలైనన్ని సార్లు పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Mahashivaratri 2024: శని దోషం తొలగిపోవాలంటే మహాశివరాత్రిరోజు శివుడిని ఇలా పూజించండి..!