మలుపు తిరుగుతున్న జగన్ దాడి కేసు: ఆ లేఖపై సందేహాలెన్నో..

                        

Last Updated : Oct 26, 2018, 01:41 PM IST
మలుపు తిరుగుతున్న జగన్ దాడి కేసు: ఆ లేఖపై సందేహాలెన్నో..

విశాఖ: వైసీపీ చీఫ్ జగన్ పై దాడి కేసు మలుపులుతిరుగుతోంది. నిందితుడి శ్రీనివాస్ జేబులో లేఖ చూపిస్తూ అతను వైసీపీకి వీరాభిమాని అంటూ  పోలీసులు ఇచ్చిన స్టేట్ మెంట్ ను వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. పదో తరగతి చదివిన వ్యక్తి అంత స్పష్టంగా ఎలా రాయగలడు ? అంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ లేఖతో నిందితుడు వైసీసీ వీరాభిమానిగా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సాయంత్రానికి హడావుడిగా 11 పేజీల లేఖ విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

వైసీపీ వాదన ఇలా ఉంది...
నిందితుడు శ్రీనివాస్ చదువుకున్నదేమో పదో తరగతి. కానీ లేఖలోని  విషయాలు..భావుకత, సమాజం పట్ల నిర్ధిష్ట అవగాహన చూస్తుంటే నిజంగా అతను రాసిందేనా అనుమానం ఎవరికైనా కలుగుతుంది. పైగా ఈ లేఖ చివరి పేజీలో సంబంధం లేకుండా ‘ఈ ఘటనలో నాకు ఏ ప్రాణహాని జరిగినా నా అవయవదానం చేయండి అమ్మా..నాన్నా’ అంటూ లేఖ ముగించడం చూస్తుంటే కావాలని పథకం ప్రకారమే ఈ లేఖ సృష్టించారని ఆరోపిస్తున్నారు. కచ్చితంగా ఈ లేఖ పోలీసులు సృష్టించిందేనన్న అనుమానాలకు బలం చేకూరుతోందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.

కాగా మరోవైపు జగన్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నాయి. విచారణ పూర్తయిన తర్వత దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ నమోదు చేసి కోర్టుకు హాజరపర్చనున్నారు.
 

Trending News