Teeth Whitening Tips: కొందరిలో దంతాలు పసుపు రంగులో ఉంటాయి. పుచ్చిపోయి కూడా ఉండటం మనం గమనిస్తు ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో పంటి నొప్పి సమస్య ఏర్పడుంది. దీంతో డెంటల్ దగ్గరకు పరిగెడుతుంటారు.
మనం ఎవరితోనైన పలకరించేటప్పుడు ముందు నవ్వుతూ పలకరిస్తాం. దీనిలో నవ్వు కీరోల్ ప్లే చేస్తుంది. మన దంతాలు తెల్లగా ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. కానీ కొందరి దంతాలు పచ్చగా, చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి.
చిన్నతనంలో ఎక్కువగా చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు తినే వారి దంతాలు ఎక్కువగా పచ్చగా ఉంటాయి. అదే విధంగా దంతాల చుట్టు ఉంటే ఎనామిల్ లేయర్ క్రమంగా కరిగిపోతుంది. దీంతో దంతాలు తొందరగా పాడౌతుంటాయి.
ఎంత నీట్ గా బ్రష్ చేసుకున్న కొందరిలో దంతాలు మాత్రం పసుపు పచ్చగానే ఉంటాయి. ఇలాంటి వారు కొన్ని రెమిడీలు పాటించాలని డెంటల్ వైద్యులు చెబుతుంటారు. రోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకొవాలి..
దంతాలు పచ్చగా ఉన్న వారు.. ఉప్పుతో శుభ్రం చేసుకుంటూ పసుపు పచ్చని మరకలు మాసిపోతాయి. బేకింగ్ సోడాతో దంతాలను శుభ్రం చేసుకున్న కూడా మంచిగా మెరుస్తాయి.
బేకింగ్ సోడాతో దంతాలను శుభ్రం చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుందని నిపుణులుచెబుతుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు స్వీట్లు తినడం అవాయిడ్ చేయాలి. దీంతో తొందరగా పండ్లు పుచ్చిపోతాయి..
వేప ఆకులు, చిన్న కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకున్న కూడా తెల్లగా మెరుస్తాయని చెబుతుంటారు. ప్రతిరోజు నీట్ గా రెండుసార్లు బ్రష్ చేసుకొవడం, రాత్రిళ్లు స్వీట్లు, ఐస్ క్రీమ్ లు అవాయిడ్ చేస్తే దంతాలు పదికాలాలపాటు హెల్ధీగా ఉంటాయి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)