Kiara Advani: స్టైలిష్ దుస్తుల్లో మెరిసిన కియారా-సిద్ధార్థ్.. ఫ్యాన్స్ కి కనుల పండగ

Kiara-Siddarth: 
మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ప్రస్తుతం ఈ హీరోయిన్ తన భర్తతో ఇచ్చిన ఫోజులు ఇంస్టాగ్రామ్ లో అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

  • Mar 05, 2024, 15:25 PM IST
1 /6

2014 లో వచ్చిన హిందీ సినిమా ఫగ్లీ ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కియారా అద్వానీ. ఎం.ఎస్.ధోని చిత్రంలో సాక్షి సింగ్ ధోని పాత్రలో కనిపించి మంచి పేరు తెచ్చుకునింది.

2 /6

లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకునింది. కాగా మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను తో తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. తెలుగులో మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్.

3 /6

కాగా తెలుగులో ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ చిత్రం మాత్రం ఈమెకు డిజాస్టర్ మిగిల్చింది. అప్పటినుంచి తెలుగులో పెద్దగా చాన్సులో రాకపోయినా హిందీలో వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

4 /6

ఈ మధ్యనే సత్య ప్రేమకి కథా సినిమాలో కనిపించి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజర్ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

5 /6

గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా ని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే వీరిద్దరి ఫోటోలు అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాయి.

6 /6

తాజాగా అనంత్ అంబానీ పెళ్లి సంబరాలకు హాజరైన వీరిద్దరూ.. స్టైలిష్ దుస్తుల్లో మెరిసిపోతూ కెమెరాకి ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం అభిమానులను ఫిదా చేస్తున్నాయి.