Boat Airdopes 161 Vs Noise Buds Vs102 In Telugu: కొత్తగా లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్‌ను దృష్టిలో పెట్టుకొని, కొన్ని ప్రముఖ టెక్ కంపెనీలు వివిధ రకాల గ్యాస్ గేట్స్‌ను?? మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మొబైల్స్ తో పాటు విక్రయాల్లో ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లు కూడా పోటీ పడుతున్నాయి. దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని టిక్ కంపెనీలు కొత్త కొత్త టెక్నాలజీతో కూడిన స్మార్ట్ వాచ్‌లను, బడ్స్ ను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది యువత ఎక్కువ ఫీచర్స్‌తో కూడిన ఇయర్ బర్డ్స్, స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇయర్ బడ్స్ విషయానికొస్తే..బోట్ ఎయిర్‌డోప్స్ 161, నోయిస్ బడ్స్ VS102 బడ్స్ విక్రయాలు పోటా పోటీగా నడుస్తున్నాయి. చాలామంది ఈ రెండింటిని కొనుగోలు చేసే క్రమంలో తికమక పడుతున్నారు వీటిలో ఏది బెస్ట్ తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటి రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో? ఫీచర్స్ పరంగా ఏది మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బోట్ ఎయిర్‌డోప్స్ 161 vs నోయిస్ బడ్స్ VS102:
ఈ రెండు బర్డ్స్ కి సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే..బోట్ ఎయిర్‌డోప్స్ 161 ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో 35 గంటల నాన్ స్టాప్ ప్లే బ్యాక్ తో అందుబాటులోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే, ఇది 10mm డ్రైవర్లు, బలమైన బాస్‌తో మంచి సౌండ్ అవుట్‌పుట్ ను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసే క్రమంలో వీటి సౌండ్ తో ఎలాంటి బోర్ లేకుండా మంచి సంగీతాన్ని వినవచ్చు. నోయిస్ బడ్స్ VS102 సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే ఈ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో 50 గంటల వరకు నాన్ స్టాప్ అవుట్‌పుట్ ని అందిస్తుంది. కాబట్టి బ్యాటరీ బలంగా ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు.
ఇక ఈ నోయిస్ బడ్స్ VS102 బడ్స్ 11mm డ్రైవర్లు, స్పష్టమైన ట్రెబుల్, బాస్ సౌండ్ తో అందుబాటులోకి వచ్చాయి. దీని పరంగా చూస్తే బోట్ ఎయిర్‌డోప్స్ 161 ఇయర్‌బడ్స్ డ్రైవర్లు చాలా తక్కువే. ఇక ఈ రెండింటి ధరల విషయానికొస్తే..బోట్ ఎయిర్‌డోప్స్ 161 బడ్స్ మార్కెట్లో సుమారు రూ.1,200 ధరతో అందుబాటులో ఉంది. ఇక నోయిస్ బడ్స్ VS102 అన్ని బ్యాంక్ ఆఫర్స్ ఫోను కేవలం ఇది రూ.1,000 లభిస్తోంది. బోట్ ఎయిర్‌డోప్స్ 161, నోయిస్ బడ్స్ VS102 రెండు వైర్లెస్ ఇయర్‌బడ్స్ రూ.1500 లోపు ధరలోనే లభిస్తాయి.
ఇతర ఫీచర్లు:
బోట్ ఎయిర్‌డోప్స్ 161: IPX4 వాటర్ రెసిస్టెన్స్, టచ్ కంట్రోల్స్, గేమింగ్ మోడ్
నోయిస్ బడ్స్ VS102: IPX5 వాటర్ రెసిస్టెన్స్, టచ్ కంట్రోల్స్, ENC (ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్)
ఫైనల్ గా ఏది బెస్ట్ అంటే:
మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్, ENC కోసం చూస్తున్నట్లయితే, నోయిస్ బడ్స్ VS102 కొనుగోలు చేయడం మంచిది. కానీ అతి తక్కువ బడ్జెట్లో తక్కువ ఫీచర్లతో కావాలనుకునేవారు బోట్ ఎయిర్‌డోప్స్ 161 బడ్స్ కొనుగోలు చేయొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter