Deepika Padukone Pregnancy Diet:
హిందీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్న నటి దీపికా పడుకోణె. దీపికా ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
హిమేష్ రేషమ్మియా తీసిన ఆప్ కా సురూర్ లోని నాం హై తేరా అనే మ్యూజిక్ వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి దీపికా పడుకోణె
ఆ తరువాత పడుకోణె ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
మొదట నటించింది సౌత్ ఇండియా చిత్రంలోనే అయినా దీపికాకి మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రం మాత్రం షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం. ఆ చిత్రం తరువాత నుంచి దీపికా రేంజ్ మారిపోయింది.
నార్త్ ఇండియాలో వరసగా అవకాశాలు అందుకుంటూ నటిగా దూసుకుపోయింది. బాలీవుడ్ లో ఎన్నో అవార్డులు రివార్డులు సైతం సంపాదించింది ఈ హీరోయిన్.
కాగా ఈ మధ్య బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ అని పెళ్లి చేసుకున్న దీపిక ప్రెగ్నెంట్ అని గత కొద్ది రోజుల నుంచి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో దీపిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హెల్తి ఫుడ్ తింటూ.. రెస్ట్ తీసుకుంటూ కనిపించిన దీపిక ఫోటోలు చూసి.. ఈ హీరోయిన్ చెప్పకనే తన ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.